BIG BREAKING: కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడి టార్చర్.. యువకుడు ఆత్మ*హత్య!

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ వేధింపులను తట్టుకోలేక కుమార్ యాదవ్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update
suicide

Hyderabad Crime News

TG Crime: కూకట్‌పల్లి వెంకట్రావు నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ వేధింపులను తట్టుకోలేక  కుమార్ యాదవ్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. గత ఎనిమిదేళ్లుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ దగ్గర కుమార్ యాదవ్ ఉద్యోగం చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కుత్బుల్లాపూర్ ఎంపీపీగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయనకు చెందిన "సమ్మక సారక్క కాంక్రీట్ వర్క్" లో కుమార్ యాదవ్ పనిచేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే తమ్ముడు వేధింపులు.. 

ఇటీవల ఆ సంస్థలో కోటి రూపాయల మేర నిధులు మాయం అయ్యాయంటూ శ్రీనివాస్ గౌడ్, కుమార్ యాదవ్‌పై చార్జులు మోపారు. తాను నిరపరాధినని ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని కుమార్ యాదవ్ స్పష్టంగా చెప్పినా ఆయన మాటలను ఎవరూ వినలేదు. పదే పదే వేధింపులకు గురిచేస్తూ అతని వ్యక్తిగత వస్తువులను కూడా లాక్కున్నారు. టాటా టియాగో కారు, సెల్‌ఫోన్‌ను కూడా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు తీసుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఒత్తిడికి లోనైన కుమార్ యాదవ్ తీవ్ర మనోవేదనలోకి వెళ్లి చివరికి తెల్లవారు జామున తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇది కూడా చదవండి: నిద్రపోతున్నప్పుడు ఎందుకు చనిపోతారో తెలుసా..? ఈ కారణం వల్లనే

కుమార్ యాదవ్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతికి పూర్తి బాధ్యత మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్‌కే ఉందని వారు ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు.  అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  కుమార్‌ మృతితో స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని స్థానికులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: శివునితోపాటు సోమవారం ఏ దేవతలను పూజించాలో తెలుసా..?

( TG Crime | crime | Latest News | telugu-news)

Advertisment
తాజా కథనాలు