Ap Crime News: NTR జిల్లాలో దారుణం.. కొడుకును చెక్కతో కొట్టి చంపిన తండ్రి
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొడుకు వెంకటనారాయణ (35)ను కన్న తండ్రి చెక్క ముక్కతో కొట్టి హతమార్చాడు. సోమవారం రాత్రి ఫుల్‌గా తాగొచ్చి తల్లిదండ్రులపై దాడిచేయడంతో తండ్రి చంపేశాడు.