/rtv/media/media_files/2025/07/16/miscreants-pour-petrol-on-husband-and-wife-and-set-them-on-fire-in-palnadu-2025-07-16-09-09-03.jpg)
Fire accident
Fire accident : దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మోతీనగర్‌లో గల రాజా గార్డెన్‌లోని నాలుగు అంతస్థుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్థులో ఉన్న మహాజన్ ఎలక్ట్రానిక్స్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి:హైదరాబాద్ లో భారీ వర్షాలు.. వర్షంలో తడుస్తూ పోలీసుల విధులు!-PHOTOS
షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో షాపులో పనిచేసే ఐదుగురు సిబ్బంది పొగదాటికి అపస్మరకస్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించగా, నలుగురు అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి:తెలంగాణలో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!