Crime News: మరో భర్త బలి.. మరిగే నూనె పోసి అతి కిరాతంగా హత్య చేసిన భార్య

చెన్నై కొళత్తూర్‌లో లక్ష్మీనగర్‌కు చెందిన ఖాదర్ బాషా(42)కు నిషాతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఖాదర్ ఎక్కువగా మద్యం సేవిస్తూ భార్యతో గొడవపడుతుంటాడు. ఇలానే ఖాదర్ తాగి వచ్చి భార్యతో గొడవపడటంతో మరిగిన నూనె తీసుకొచ్చి భర్తపై వేసి హత్య చేసింది.

New Update
Tirupati Crime News

Crime News

నేటి రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు భయపడుతున్నారు. ఎందుకంటే భార్యలు భర్తలను ఎప్పుడు చంపుతారనే భయంతో పెళ్లికి నో చెబుతున్నారు. అయితే వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు పెళ్లి అయిన తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే భర్తను దారుణంగా హత్య చేస్తున్న సంఘటనలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి కారణాలతో పాటు మద్యం సేవించి భార్యతో డైలీ గొడవ పడుతుంటే భరించలేక కొందరు భార్యలు భర్తలను చంపుతుున్నారు. తాజాగా చెన్నైలోనూ ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. 

ఇది కూడా చూడండి: Bandlaguda: బండ్లగూడలో విషాదం.. వినాయక విగ్రహం తీసుకొస్తుండగా ఇద్దరు యువకులు మృతి

వేడిగా మరుగుతున్న నూనె వేసి..

వివరాల్లోకి వెళ్తే.. చెన్నై కొళత్తూర్‌లో లక్ష్మీనగర్‌కు చెందిన ఖాదర్ బాషా(42)కు నిషాతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే ఖాదర్ ఎక్కువగా మద్యం సేవిస్తూ భార్యతో గొడవపడుతుంటాడు. ఇలానే ఈ నెల 9వ తేదీన రాత్రి ఖాదర్ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆగ్రహానికి గురైన భార్య మరిగిన నూనె తీసుకొచ్చి భర్తపై వేసింది. భర్త తీవ్రంగా గాయపడటంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. చివరకు చికిత్స తీసుకుంటూ ఆ భర్త మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య నిషాను అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: నెల్లూర్‌లో లేడీ డాన్ అరుణ అరెస్ట్

భర్తలు ఇలా తాగి వచ్చి భార్యలను కొడితే కొందరు భరిస్తారు. మరికొందరు విసుగెత్తి, టార్చర్ భరించలేక ఒక్కసారి దాడి చేస్తారు. కొందరు భర్త పెట్టే టార్చర్ భరించలేక దాడి చేస్తే, మరికొందరు వివాహేతర సంబంధాల కోసం భర్తలను చంపుతున్నారు. ఏదో ఒక కారణంతో భార్యల చేతిలో భర్తలు బలి అవుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు