Hyderabad: రామంతపూర్ షాక్ ఘటనకు కారణం వాళ్లే.. ఘటనా స్థలంలో హైటెన్షన్!

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో రథానికి విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు మృతి చెందారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని న్యాయం కావాలని స్థానికులు విద్యుత్ శాఖ సీఎండీని అడ్డుకున్నారు.

New Update
Ramanthapur

Ramanthapur

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కృష్ణాష్టమి శోభాయాత్రలో రథానికి విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని స్థానికులు విద్యుత్ శాఖ సీఎండీని అడ్డుకున్నారు. న్యాయం జరిగే వరకు తాము ఇక్కడి నుంచి కదలమన్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. గోఖలే నగర్‌లో కొత్తగా ఏం విద్యుత్ సమస్యలు కాదని, ఎప్పటి నుంచో ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఎలాగైనా వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: BREAKING: కృష్ణాష్టమి వేడుకలో తీవ్ర విషాదం.. ఊరేగింపులో ఐదుగురు మృతి

కరెంట్ తీగలు తగిలి..

ఇదిలా ఉండగా ఆదివారం శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా గోఖలే నగర్ యాదవ సంఘం అధ్వర్యంలో సోమవారం తెల్లవారు జామున శోభాయాత్ర నిర్వహించారు. అయితే రథానికి కట్టిన జీపు సడెన్‌గా పాడవడంతో స్థానికులు, భక్తులు రథాన్ని లాగుతూ ఉరేగించారు. అయితే ఈ సమయంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లు ఒక్కసారిగా శోభాయాత్ర రథానికి తాకాయి. దీంతో దాదాపుగా డజన్ మందికి విద్యుత్ షాక్ తగలడంతో స్పాట్‌లోనే ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురి పరిస్థితి కూడా విషమంగా మారింది. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో 24 ఏళ్ల కుర్రాడు కూడా మృతి చెందాడు. ఒకే ఒక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఈ యువకుడు మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

ఇది కూడా చూడండి: Crime: అయ్యో .. కూతురి అప్పగింతలు చేస్తూ.. ఆగిపోయిన తల్లి గుండె! పెళ్లి వేడుకలో విషాదం

మృతిచెందిన వారిలో కృష్ణయాదవ్‌ (24), సురేశ్‌ యాదవ్‌(34), శ్రీకాంత్‌రెడ్డి(35), రుద్రవికాస్‌(39), రాజేంద్రరెడ్డి(45) ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్‌ శ్రీనివాస్‌ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఊరేగించే సమయంలో అధిక వర్షం కూడా పడుతోంది. వర్షం పడటం, కరెంట్ తీగలు కిందకి వాలి ఉండటం వల్ల ఒక్కసారిగా కృష్ణుడు రథానికి తగిలింది. దీంతో స్పాట్‌లోనే ఐదుగురు దూరంగా ఎగిరిపడ్డారు. వీరు స్పాట్‌లోనే మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా మారింది. ఆ తర్వాత చికిత్స తీసుకుంటూ ఆసుపత్రిలో ఒకరు మృతి చెందారు.

Advertisment
తాజా కథనాలు