/rtv/media/media_files/2025/08/17/shooting-at-bigg-boss-2-winner-house-2025-08-17-12-19-30.jpg)
Shooting at Bigg Boss 2 winner's house.
Elvish Yadav : బిగ్‌బాస్ ఓటీటీ(హిందీ) వర్సన్ సీజన్-2 విజేత, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో హరియాణా గురుగ్రామ్‌లోని అతడి ఇంటి వద్దకు ముగ్గురు గుర్తు తెలియని దుంగడులు బైక్‌పై వచ్చినట్లు తెలిసింది. కాసేపు అక్కడే గడిపిన వారు.. ఎల్విష్ నివాసంపై సుమారు 24 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ముగ్గురు దుండగులు, ముసుగు వేసుకుని, కాల్పులకు తెగబడ్డారని తెలిసింది.
🚨🚨Gurugram बदतर हालात में है!
— Manu🇮🇳🇮🇳 (@mshahi0024) August 17, 2025
- टूटी फूटी सड़कें
- जल भराव
-भ्रस्टाचार
-बदतर ट्रांसपोर्ट सिस्टम
-कुड़ा ग्राम
5Cr से लेकर 150 करोड़ के घर लेने के बाद भी सुरक्षा Zero.
अपराधियों ने तांडव मचा रखा है!
Elvish यादव के घर पर कई राउन्ड गोलियाँ!pic.twitter.com/jVlAzLxVlb
ఈ సంఘటన సెక్టార్ 57లో తెల్లవారుజామున సుమారు 5.30 గంటల సమయంలో జరిగింది. "పదుల సంఖ్యలో రౌండ్లు కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేరు," అని గురుగ్రామ్ పోలీస్ పీఆర్ఓ సందీప్ కుమార్ మీడియాతో చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ బృందాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. భవనంలోని రెండు, మూడో అంతస్తులో ఎల్విష్ కుటుంబంతో సహా నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో తూటాలు మొదటి అంతస్తులోకి దూసుకువెళ్లాయి. ఇంటి గోడలకు బుల్లెట్ తగిలిన ఆనవాళ్లు ఉన్నాయి. దాడి జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడని..అతడి కుటుంబసభ్యులు, కేర్‌టేకర్ ఉన్నారని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. అయితే ఘటనకు ముందు అతడికి ఎటువంటి బెదిరింపులు రాలేదని కుటుంబసభ్యులు వెల్లడించారు.
ప్రస్తుతం ఎల్విష్ యాదవ్ హరియాణా బయట ఉన్నట్లు తెలిసింది. కాల్పుల వల్ల పగిలిన అద్దాలు, దెబ్బతిన్న పైకప్పు, ఇతర ఆనవాళ్లకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎల్విష్ యాదవ్ కుటుంబ సభ్యులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుని, దర్యాప్తును వేగవంతం చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఎల్విష్ యాదవ్ కుటుంబం ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఒక సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు. పారిపోయే ముందు దుండగులు యూట్యూబర్ ఇంటిపై రెండు డజన్లకు పైగా రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. బుల్లెట్లు ఇంటి గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌లను కూడా తాకాయని పోలీసులు వెల్లడించారు. ఈ దాడికి ముందు ఎల్విష్‌కు ఎలాంటి బెదిరింపులు రాలేదని ఆయన బంధువు ఒకరు చెప్పారు.
కాగా పార్టీల్లో డ్రగ్స్‌గా స్నేక్ వీనమ్ (పాము విషం) వాడినట్లు ఎల్విష్ యాదవ్‌పై కేసు నడుస్తోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ స్నేక్ వీనమ్ కేసులో ఎల్విష్ యాదవ్ తనపై దాఖలు చేసిన ఛార్జిషీట్, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు మే నెలలో కొట్టివేసింది. యాదవ్ తరపున సీనియర్ న్యాయవాది నవీన్ సిన్హా, న్యాయవాది నిపున్ సింగ్ వాదిస్తూ, వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1972 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఫిర్యాదుదారునికి ఆ అధికారం లేదని వాదించారు. అలాగే నోయిడాలో జరిగిన ఆ పార్టీలో యాదవ్ లేరని, అతని నుంచి ఎలాంటి వస్తువులు స్వాధీనం చేసుకోలేదని కూడా డిఫెన్స్ తరపు న్యాయవాదులు వాదించారు. గత ఏడాది మార్చ్‌లో ఈ కేసులో నోయిడా పోలీసులు యాదవ్‌ను అరెస్ట్ చేశారు. యాదవ్ నుంచి ఎలాంటి పాములు, మాదకద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకోలేదని, అతనికి, ఇతర నిందితులకు మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని ఎల్విష్ యాదవ్ తరపు న్యాయవాదులు కోర్టులో పేర్కొన్నారు.