/rtv/media/media_files/2025/08/18/case-registered-against-actor-dharma-mahesh-2025-08-18-21-00-22.jpg)
Case registered against actor Dharma Mahesh
Dharma Mahesh : సినిమాల్లో హీరో కానీ, రియల్ లైఫ్ లో మాత్రం కట్టుకున్న భార్యకే విలన్ గా మారాడు. సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలు, షికార్లకు అలవాటు పడిన హీరో ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. ధర్మ మహేష్ ‘సిందూరం’ (2023), ‘డ్రింకర్ సాయి’ చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారంటూ మహేశ్, కుటుంబ సభ్యులపై నటుడి భార్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వరకట్నం వేధింపులకు సంబంధించి గతంలో ధర్మ మహేశ్‌కు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
Also Read: Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
ధర్మా మహేష్ అలియాస్ కాకాని ధర్మసత్య సాయి శ్రీనివాస మహేష్(30) మాదాపూర్ లోని ఫార్చ్యూన్ టవర్స్ లో నివాసం ఉంటున్నాడు....ధర్మ మహేష్ కు 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి (31) తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారగా 2019లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. గౌతమితో పాటు ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఇద్దరు కలిసి ఓ హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. కాగా ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలకు అలవాటు పడిన ధర్మా మహేష్, యువతులతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురి చేయసాగాడు. ప్రస్తుతం తన స్టేటస్ పెరిగిందని.. అదనపు కట్నం కావాలంటూ ధర్మ మహేష్, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. గౌతమి డబ్బుతో ప్రారంభించిన హోటల్ ఫ్రాంచైజీ ని సైతం తన పేరు మీదకు మార్చుకున్నాడు.
ఇది కూడా చూడండి:Rahul Sipligunj Engagement: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. వైరలవుతున్న ఫొటోలు!
ధర్మ మహేష్, అతని కుటుంబ సభ్యుల శారీరక, మానసికవేధింపులకు విసిగిపోయిన భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది. దీంతో గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో హీరో ధర్మా మహేష్ మీద బి.ఎన్.ఎస్ సెక్షన్ 85, 115(2), 316(2), 351(2), 352, సెక్షన్ 4 ఆఫ్ డిపి యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధర్మ మహేష్ గతంలో సైతం వేధింపుల గురి చేయడంతో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారని కానీ ధర్మా మహేష్ తీరు మారకపోవడంతో మరోసారి పోలీసులను ఆశ్రయించినట్లు గౌతమి తన ఫిర్యాదులో తెలిపింది.
ఇది కూడా చూడండి: రామంతపూర్ షాక్ ఘటనకు కారణం వాళ్లే.. ఘటనా స్థలంలో హైటెన్షన్!