KTR : తెలంగాణలో నెలరోజుల్లో 28 హత్యలు..శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్‌ సంచలన ఫోస్ట్

తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించి నేరాలు పెరిగాయని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. కేవలం నెల రోజుల్లోనే 28 హత్యలు జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

New Update
28 murders in Telangana in a month..

28 murders in Telangana in a month..

KTR :  తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించి నేరాలు పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. కేవలం నెల రోజుల్లోనే 28 హత్యలు జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని.. దీనికి రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇది కూడా చూడండి:Rahul Sipligunj Engagement: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. వైరలవుతున్న ఫొటోలు!

హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో రోజుల వ్యవధిలోనే దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం పట్టపగలే జ్యువెల్లరీ షాపులో గన్‌పాయింట్ దోపిడీ జరిగింది. ఈ ఘటన మరువకముందే ఆగస్టు 18న కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అంతకుముందు హైదరాబాద్‌లోని శాలివాహన నగర్‌లో వాకింగ్‌కు వెళ్లిన CPI నేతను దుండగులు దారుణంగా కాల్చి చంపారు. అదే రోజు మెదక్ జిల్లాలో మరో రాజకీయ నేతను కూడా దారుణంగా చంపేశారు. ఇలా వరుస ఘటనలు జరగడంతో రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శాంతి భద్రతలను కాపాడటంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణలు వినవస్తున్నాయి.
తాజాగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన పలు పత్రిక కటింగ్‌లను పోస్ట్‌ లో ప్రస్తావించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారాల వ్యవధిలోనే పెద్ద పెద్ద సంఘటనలు జరగడంపై విమర్శలు గుప్పించారు. ఇటువంటి ఘటనలతో తెలంగాణ ప్రజల్లో రోజు రోజుకీ భయం పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు ఉందని.. శాంతిభద్రతలపై ప్రభుత్వం కనీస దృష్టి పెట్టట్లేదని ఆరోపించారు. అంతేకాకుండా సమర్థవంతమైన తెలంగాణ పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది భయం కాదు.. భద్రత అంటూ ఎక్స్‌లో ఈ ఘటనల వివరాలను షేర్ చేశారు. 

Also Read: Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ

మరోవైపు రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం వల్లే శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి.

Also Read : వరుణ దేవా అండర్‌పాస్‌లో కారు కష్టాలు.. వైరల్ వీడియో

#ktr #murder #Telangana Crime #crime news #kukatpally murder case
Advertisment
తాజా కథనాలు