/rtv/media/media_files/2025/08/17/father-commits-suicide-by-poisoning-two-children-2025-08-17-10-29-29.jpg)
Father commits suicide by poisoning two children
AP Crime: గుంటూరు జిల్లా బావాపేటలోని సాయిబాబా కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు ఎలుకలమందు ఇచ్చి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.నరసరావుపేటలోని బావాపేటకు చెందిన షేక్ ఈసూబ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు సైదాబీతో ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి సైదు హుస్సేన్, ఆరిఫ్ ఇద్దరు కుమారులున్నారు. ఆర్థిక సమస్యలతో గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆయన ఈ నెల 14న తన అక్క మహాబీకి ఫోన్ చేసి వివరించాడు.ఆ తర్వాత భార్యతో మరోసారి గొడవ కావడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని గుంటూరులోని సాయిబాబానగర్‌లో ఉంటున్న అక్క ఇంటికి వచ్చాడు. తమ్ముడికి సర్ది చెప్పిన మహాబీ ఆదివారం కుటుంబసభ్యులంతా నరసరావుపేట వెళ్లి సైదాబీతో మాట్లాడతామని వివరించింది.
ఇది కూడా చదవండి: బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి స్పాట్‌లోనే 10 మందికి..
ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈసూబు తన ఇద్దరు కుమారులకు ఎలుకల మందు పాలలో కలిపి తాగిచ్చాడు. దీంతో వారు చనిపోయారు. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఈసూబు కూడా ఉరేసుకున్నాడు. సాయంత్రం మహాబీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి ముగ్గురు మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. వెంటనే తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు తెలియజేశారు. మహాబీ భర్త మీరావలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లాలాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read:"50 ఏళ్ల లెజెండరీ జర్నీకి హాట్స్ ఆఫ్..!" మోడీ, చంద్రబాబు విషెస్ కు తలైవర్ రిప్లై ఇదే..
కాగా ఘటన స్థలాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ముద్దు.. ముద్దు మాటలతో అప్పటివరకూ ఆడుకున్న ఆ చిన్నారులిద్దరూ విగతజీవులుగా కనిపించేసరికి కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోయారు. కుటుంబ సభ్యులంతా వెళ్లి వారి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో కలహాలు సద్దుమణికి పిల్లలు తల్లి ఒడికి చేరతారని భావించిన వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. కానీ, చివరికి వారు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సబ్యుల దుంఖం కట్టలు తెంచుకుంది. ఈసూబ్, సైదాబీల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండగా గతంలో ఒకసారి నరసరావుపేట పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. ఇప్పుడు మరోసారి గొడవ జరగడంతో చివరికి ప్రాణం తీసుకునే పరిస్థితికి చేరడం అందరినీ కలిచివేసింది.
ఇది కూడా చదవండి:తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...