HYD Crime News: వీడు వార్డెన్ కాదు వేస్ట్ ఫెలో.. హైదరాబాద్‌లో బయటపడ్డ దారుణం!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఎన్‌పిపి ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్‌ యజమాని సత్య ప్రకాష్‌ని చితకబాదారు. అమ్మాయిలపై అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు సత్య ప్రకాష్‌ను చితకబాదారు.

New Update

సిటీలో జీవన ఉపాధి కోసం వచ్చినవారి కష్టాలు మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఉద్యోగం కోసం వచ్చిన కొందరూ హాస్టళ్లలో, రూమ్‌లో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే హాస్టళ్లలో ఉంటే కొందరూ వార్డెన్లు లేదా ఇతర సిబ్బంది విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరుచూ చూస్తూనే ఉంటాము. ఈ ప్రవర్తన విద్యార్థినుల మానసిక ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి సంఘటనలను నివారించడానికి.. విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తాజాగా భాగ్యనగర్‌లో ఫెక్‌ వార్డెన్ అరాచకంపై తల్లింద్రులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఎన్‌పిపి ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఓ ఘటన కలకలం సృష్టించింది. హాస్టల్ యజమాని సత్య ప్రకాష్‌పై అభ్యంతరకరమైన ప్రవర్తన ఆరోపణలతో. హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిలు మరియు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించాడని..

వివరాల్లోకి వెళ్తే.. హాస్టల్ యజమాని సత్య ప్రకాష్ ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం హాస్టల్‌లో ఉన్న ఇతర అమ్మాయిలకు తెలియడంతో వారు వెంటనే తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని సత్య ప్రకాష్‌ను నిలదీశారు. వాగ్వాదం పెరిగి ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు మరియు వారి తల్లిదండ్రులు సత్య ప్రకాష్‌ను చితకబాదినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: పల్సర్‌ బైక్‌ కొనివ్వలేదని .. కన్నతండ్రిపైనే కొడుకు హ*త్యాయత్నం

ఈ ఘటనతో హాస్టల్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్య ప్రకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన మహిళల భద్రతకు సంబంధించిన హాస్టల్స్‌లో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు మరియు హాస్టల్‌లో ఉంటున్న ఇతర అమ్మాయిలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటన మాదాపూర్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: కామపిశాచి.. ప్రియుడి కోసం భర్త, మామను లేపేసిన భార్య..

Advertisment
తాజా కథనాలు