Uttarakhand Cloud Burst: మళ్ళీ ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు..పలువురు గల్లంతు
ఉత్తరాఖండ్ లో మరోసారి కుంభవృష్టి కురిసింది. దీంతో మెరుపు వరదలు చమోలీ జిల్లా మెరుపు వరదల్లో మునిగిపోయింది. సగ్వారా గ్రామంలో ఒక యువతి చనిపోగా..పలువురు గల్లంతయ్యారు.
ఉత్తరాఖండ్ లో మరోసారి కుంభవృష్టి కురిసింది. దీంతో మెరుపు వరదలు చమోలీ జిల్లా మెరుపు వరదల్లో మునిగిపోయింది. సగ్వారా గ్రామంలో ఒక యువతి చనిపోగా..పలువురు గల్లంతయ్యారు.
హిమాచల్ ప్రదేశ్లో భారీగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపుగా 355 రోడ్లు ఇప్పటి వరకు మూతపడ్డాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపుగా 261 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.
గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. మృతుల్లో 140 మందికి పైగా చిన్నారులు ఉండటం అత్యంత విషాదకరం.
జమ్మూకశ్మీర్లోని కిశ్త్వర్లో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
మొన్న హిమాచల్ ప్రదేశం, నిన్న జమ్మూ-కాశ్మీర్ ను అకస్మాత్తు వరదలు ముంచేశాయి. అక్కడ క్లౌడ్ బరస్ట్ పెను విషాదం నింపింది. చోసిటీ లో ఇప్పటి వరకు 46 మృతదేహాలు వెలికి తీశారు. మరింత ప్రాణ నష్టం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని మచైల్ సమీపంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 33 మంది మరణించారు. దాదాపు 200 మంది గల్లంతయ్యారు. క్లౌడ్ బరస్ట్ పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తుంది. దీని వెనుక కొన్ని భౌగోళిక, వాతావరణ పరిస్థితులు ఉంటాయి.
జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ రావడంతో స్పాట్లోనే 12 మంది మృతి చెందారు. స్థానిక మచైల్ మాతా గుడికి వెళ్తుండగా నది దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇంకా కొందరు మృతి చెందడం లేదా గాయాలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్లకు పైగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో ఉన్నట్టుండి ముంచుకొచ్చిన వరదలపై వాతావరణశాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ కు కారణమయ్యేంత వర్షపాతం అక్కడ నమోదు కాలేదని చెబుతున్నారు. దీనిపై మరింత పరిశోధన జరగాలని చెబుతున్నారు.