/rtv/media/media_files/2025/08/30/jk-2025-08-30-08-52-28.jpg)
Ramban, Jammu and Kashmir.
24 గటల తేడాలో వరుసగా రెండు క్లౌడ్ బరస్ట్ల్(Cloud Burst) లు జమ్మూ, కాశ్మీర్(Jammu and Kashmir) ను ముంచెత్తాయి. ఆగకుండా పడుతున్న భారీ వర్షాల కారణంగా అక్కడ పరిస్థితి అతలాకుతలం అయింది. తాజాగా రామ్ బాణ్ జిల్లా వరదల్లో కొట్టుకుపోయింది. ఇందులో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందగా మరి కొంత మంది గల్లంతయ్యారు. చీనాబ్ నదికి దగ్గర ఉండే జిల్లాల్లో రామ్ బాణ్ ఒకటి. చీనాబ్ నది.. జమ్మూ, శ్రీనగర్‌లను కలిపే జాతీయ రహదారి-44 పై ఉన్న రాంబన్ జిల్లా పర్వత ప్రాంతాలకు ప్రసిద్ధి చెందింది. విపరీతంగా కుస్తున్న వర్షాల కారణంగా చీనాబ్ నది ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరదలు సంభవిస్తున్నాయి. నదిలోని నీరంతా అక్కడి గ్రామాలను ముంచేస్తోంది. జమ్మూ, కాశ్మీర్ లో ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 24గంటల తేడాలో రెండు సార్లు, వారంలో మూడు క్లౌడ్ బరస్ట్ సంభవించింది. శుక్రవారం బండిపోరా జిల్లాలోని గురేజ్ సెక్టార్ ను వరద ముంచెత్తింది. అయితే ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదు. అంతకు ముందు దోడా జిల్లాలో వరదలు సంభవించాయి. దీని కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. జమ్మూ-శ్రీనగర్ హైవే మూసివేయబడింది. ఈ మార్గంలో అనేక చోట్ల కొండచరియలు(Landslides) విరిగిపడటం వలన ట్రాఫిక్ నిలిచిపోయింది.
#BREAKING || Cloudburst in J&K's Ramban, three bodies recovered.@SaahilSuhail shares more details with @Anchoramitaw.#Cloudburst#JammuKashmirpic.twitter.com/BDpRmXYByD
— TIMES NOW (@TimesNow) August 30, 2025
Also Read : లవర్‌ను పెళ్లి చేసుకుందామని లేచిపోయిన అమ్మాయికి ఎదురుదెబ్బ.. సినిమా మాదిరి ట్విస్ట్
పెను విషాదం మిగిల్చిన వైష్ణోదేవి యాత్ర..
మూడు రోజుల క్రితం భారీ వర్షాల(Heavy Rains) కారణంగా వైష్ణోదేవి యాత్ర పెను విషాదం మిగిల్చింది. రియాసి జిల్లాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఈ ఘటన అర్ధకుమారి ప్రాంతానికి సమీపంలో చోటుచేసుకుంది. ఇప్పటి వరకు 39 మృతదేహాలను వెలికి తీశారు. ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండవచ్చని...కానీ మూడు రోజులుగా కుండపోత వర్షాలు పడడంతో సహాయక చర్యలు చేయడం కుదరడం లేదని అధికారులు చెబుతున్నారు.
భారీ వర్షాల కారణంగా కేంద్ర పాలిత ప్రాంతం అంతా అల్లకల్లోలంగా తయారయ్యింది. ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అక్కడ కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. మరోవైపు ఆగకుండా పడుతున్న వర్షాల కారణంగా జీలం నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో చాలా మంది తాము ఉంటున్న నివాస ప్రాంతాలను వదిలి వెళ్ళాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. జమ్మూ & కాశ్మీర్ పోలీసులు, NDRF, SDRF, భారత సైన్యం మరియు స్థానిక స్వచ్ఛంద సేవకుల సంయుక్త బృందాలు సహాయక చర్యలను చేస్తున్నారు.
Also Read : సంచలన సర్వే.. దేశంలో బెస్ట్ CM ఎవరో తెలుసా?