Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండ చరియలు.. 261 మంది మృతి!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపుగా 355 రోడ్లు ఇప్పటి వరకు మూతపడ్డాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపుగా 261 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.

New Update
Himachal pradesh

Himachal pradesh

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తన్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల క్లౌడ్ బరస్ట్(Cloud Burst) కూడా విధ్వంసం సృష్టించింది. అయితే హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh) లోని కులులో భారీ వర్షాలు కురవడంతో ప్రధాన మార్గాలు అన్ని కూడా మూత పడుతున్నాయి. కొండ చరియలు విరిగిపడటంతో వెయ్యికి పైగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.

ఇది కూడా చూడండి: C.P. Radha Krishnan: రాధాకృష్ణన్ ర్యాలీపై బాంబుల వర్షం.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా!?

భారీగా రోడ్లు దెబ్బతినడంతో..

రోడ్లు దెబ్బతినడంతో దాదాపుగా 15 పంచాయతీలకు సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బజౌరా చెక్ పోస్ట్ దగ్గర కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కసోల్-కులూ మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో దాదాపుగా 355 రోడ్లు ఇప్పటి వరకు మూతపడ్డాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపుగా 261 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. 

భారీ వర్షాల కారణంగా..

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల కొన్ని జిల్లాలకు అక్కడ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు. కొండ ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు  జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇది కూడా చూడండి: Mumbai Rains: డేంజర్ లో ముంబై.. మరోసారి ముంచుకొస్తున్న భారీ వర్షాలు

Advertisment
తాజా కథనాలు