BIG BREAKING: క్లౌడ్ బరస్ట్.. బీభత్సమైన వరదలు.. 12 మంది స్పాట్ డెడ్!

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ రావడంతో స్పాట్‌లోనే 12 మంది మృతి చెందారు. స్థానిక మచైల్ మాతా గుడికి వెళ్తుండగా నది దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇంకా కొందరు మృతి చెందడం లేదా గాయాలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టిస్తోంది. కిష్త్వార్ ప్రాంతంలో భారీ వరదలు రావడంతో స్పాట్‌లోనే 12 మంది మృతి చెందారు. జమ్మూ కశ్మీర్‌లో స్థానిక మచైల్ మాతా గుడికి వెళ్తుండగా నది దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇంకా కొందరు మృతి చెందడం లేదా గాయాలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుకున్న తర్వాత ఆర్మీ, ఎన్డీఆర్‌ఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: TG Crime: ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ.. వెంటిలేటర్‌పై యువతికి చికిత్స.. పరారీలో లవర్

హిమాచల్ ప్రదేశ్‌లోనూ క్లౌడ్ బరస్ట్..

జమ్మూకశ్మీర్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్‌లో కూడా క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లా-లాహౌల్-స్పితి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ వల్ల ఆకస్మిక వరదలు రావడంతో పలు చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకునిపోయాయి. దాదాపుగా 300లకు పైగా రోడ్లు కూడా మూతపడ్డాయి. క్లౌడ్ బరస్ట్‌కు ఎన్నో ఇళ్లు, భవనాలు అన్ని కూడా కొంచెం కొంచెం కొట్టుకునిపోయాయి. క్లౌడ్ బరస్ట్ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: భారీ వర్షాలు.. నడి రోడ్డుపై కూలిన చెట్టు.. స్పాట్లో ముగ్గురు..!

ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ ఎఫెక్ట్..

ఇదిలా ఉండగా ఇటీవల ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ రావడంతో ధరాలీ గ్రామం మొత్తం కొట్టుకునిపోయింది. ఒక్కసారి పై నుంచి రావడంతో డౌన్‌లో ధరాలీ గ్రామం ఉండటంతో ఇళ్లు, భవనాలు, హోటళ్లు కూలిపోయాయి. ఈ ప్రమాద ఘటనలో ఎందరో మృతి చెందారు. దీనికి సమీపంలో ఆర్మీ బేస్ క్యాంప్ కూడా ఉండేది. ఇక్కడ ఉండే 10 మంది జవాన్లు కూడా మృతి చెందారు. క్లౌడ్ బరస్ట్ తర్వాత సహాయక చర్యలు చేపట్టినా కూడా ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగింది. ఎందరో ఈ వరదల్లో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వరదలు, క్లౌడ్ బరస్ట్ ఎక్కువగా జరుగుతుంటాయి. 

Advertisment
తాజా కథనాలు