Cloud Burst: క్లౌడ్‌ బరస్ట్ విషాదం.. 60 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వర్‌లో గురువారం క్లౌడ్‌ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.

New Update
Jammu and kashmir cloudburst deaths cross 60

Jammu and kashmir cloudburst deaths cross 60

జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir) లోని కిశ్త్‌వర్‌లో గురువారం క్లౌడ్‌ బరస్ట్(Cloud Burst) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. అలాగే మరో 100 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు. గల్లంతైన వారి ఆచూకి కోసం రెండోరోజు ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్‌ చేశారని.. ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీశారని పేర్కొన్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. క్లౌడ్‌ బరస్ట్ జరిగిన ప్రాంతంలో అక్కడ దాదాపు 1200 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

Also Read: IAF రియల్ హీరో.. పాకిస్థాన్ జైలు నుంచి 2సార్లు తప్పించుకున్న వింగ్ కమాండర్ కథ!

Cloud Burst In Jammu & Kashmir

ఇప్పటికే కిశ్త్‌వర్‌లో NDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రతికూల వాతావరణం ఉండటం వల్ల ఆ ప్రాంతానికి హెలికాప్టర్లు వెళ్లడం లేదని అధికారులు పేర్కొన్నారు. అందుకే రోడ్డు మార్గం ద్వారా సహాయక బృందాలు వెళ్తున్నాయని తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో సహా మొత్తంగా 300 మంది సైనిక టీమ్‌ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యింది. అయితే ఇప్పటిదాకా దొరికిన మృతదేహాల్లో 21 మందిని గుర్తించామని అధికారులు చెప్పారు.    

Also Read: ఎర్రకోటపై ప్రసంగించి రికార్డు సృష్టించిన మోదీ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఫొటోలు చూశారా?

Also Read: అడుగడునా ప్రకృతి అందాలు.. 8.5 కిలో మీటర్ల నడక.. మచైల్ మాత యాత్ర ఎంత కష్టమంటే!?

ఇదిలాఉండగా జమ్మూకశ్మీర్‌లో గురువారం క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించింది. ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మచైల్ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు కూడా దీని ప్రభావానికి మృతి చెందారు. పలు భవనాలు, దుకాణాలు కూడా కొట్టుకుపోయాయి. ఈ విషాద ఘటన నేపథ్యంలో మచైల్ మాతా దేవీ యాత్రను అధికారులు నిలిపివేశారు. 

Advertisment
తాజా కథనాలు