Pakistan Floods: పాకిస్తాన్‌లో 300 మంది మృతి.. 140కిపైగా చిన్నారులే

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. మృతుల్లో 140 మందికి పైగా చిన్నారులు ఉండటం అత్యంత విషాదకరం.

New Update
Pakistan due to heavy rains

Pakistan due to heavy rains

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు(Heavy Rains), ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టించాయి. ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. మృతుల్లో 140 మందికి పైగా చిన్నారులు ఉండటం అత్యంత విషాదకరం. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా 48గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా వివిధ ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.

Also Read :  కాల్పుల విరమణకు అంగీకరించం.. ట్రంప్ ముందే పుతిన్ సంచలనం.. వీడియో వైరల్

Heavy Rains In Pakistan

దీంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోనే 184 మంది మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్య్కూ టీంలో ఇద్దరు హెలికాప్టర్ సిబ్బంది కూడా ప్రమాదవశాత్తు మరణించారు. షాంగ్లాలో 36 మంది మరణించగా, మన్సెహ్రాలో 23, స్వాత్ 22, బజౌర్ 21, బట్టాగ్రామ్ 15, లోయర్ దిర్‌లో ఐదుగురు మరణించగా, అబ్బోటాబాద్‌లో ఓ చిన్నారి మునిగిపోయింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని కారకోరం హైవే, బాల్టిస్తాన్ హైవేతో సహా వరదలు అనేక భవనాలను దెబ్బతీశాయి. 

పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారీ వర్షాల వల్ల దేశవ్యాప్తంగా 1,600లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటిలో 500లకు పైగా ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. అనేక చోట్ల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం, సహాయక బృందాలు కలిసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాల ధాటికి మనుషులే కాకుండా, 400కు పైగా మూగజీవాలు కూడా మృత్యువాత పడ్డాయి. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఇంకా అనేకమంది గల్లంతయ్యారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Also Read :  2 నిమిషాల్లో 2 మిలియన్‌ డాలర్ల ఆభరణాలు చోరీ..వీడియో వైరల్‌

గ్లోబల్ వార్మింగ్(Global Warming) కారణంగా అసాధారణ వాతావరణ పరిస్థితులు తలెత్తుతున్నాయని, దీనివల్లే ఇటువంటి భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విపత్తు కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ నష్టం వాటిల్లుతుందని అంచనా. రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Advertisment
తాజా కథనాలు