J&K: జమ్మూ-కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్...46కు చేరిన మృతుల సంఖ్య

మొన్న హిమాచల్ ప్రదేశం, నిన్న జమ్మూ-కాశ్మీర్ ను అకస్మాత్తు వరదలు ముంచేశాయి. అక్కడ క్లౌడ్ బరస్ట్ పెను విషాదం నింపింది. చోసిటీ లో ఇప్పటి వరకు 46 మృతదేహాలు వెలికి తీశారు. మరింత ప్రాణ నష్టం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

New Update
j&k

J&K Cloud burst

జమ్మూ, కాశ్మీర్ లో చోసిటీలో క్లౌడ్ బరస్ట్ విలయం సృష్టించింది. ఒక్కసారిగా మెరుపు వరదలు రావడంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీని కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 46 మృతదేహాలను వెలికి తీశామని అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని...మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు.వందల మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, ఆర్మీ, స్థానిక వాలంటీర్లు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వీటిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  ఇప్పటి వరకు 160 మందిని కాపాడారు. వీరిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉంది. కిశ్త్‌వాడ్‌ జిల్లాలోని ప్రఖ్యాత మాచైల్‌ మాతా మందిరానికి వెళ్లే యాత్ర బేస్‌ పాయింట్‌ ఇదే కావడం...భక్తులు ఇక్కడే కార్లు ఉంచి..కాలి నడకన దర్శనానికి వెళ్తారు. 

పెద్ద సహాయక చర్యలు..మాచైల్ యాత్ర నిలిపివేత..

రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే చోసిటీ చేరుకున్నాయి. అదనపు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు. చోసిటీ, మాచైల్ మాత్ర మందిరం సముద్ర మట్టానికి సుమారు 2800 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 25న ఈ యాత్ర మొదలైంది. వేల మంది యాత్రికులు ఇక్కడకు వచ్చారు. మామూలుగా అయితే సెప్టెంబర్ 5తో ఈ యాత్ర ముగుస్తుంది. కానీ ఇప్పడు క్లౌడ్ బరస్ట్ కారణంగా మాచైల్ యాత్రం వెంటనే నిలిపేస్తున్నామని ప్రకటించారు. 

హిమాచల్ లో కూడా..

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అక్కడ కూడా బుధవారం క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకున్నాయి. శిమ్లా, లాహోల్‌-స్పితి ప్రాంతాల్లో చాలా నిర్మాణాలు కొట్టుకుపోయాయి. దాదాపు జాతీయ రహదారులతో సహా 300 మార్గాలను మూసివేశారు. కుల్లు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు