హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ కిందికి దూసుకెళ్లిన కారు!
హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుబేదారి చౌరస్తాలో నిన్న రాత్రి అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లారీ కిందకి దూసుకుపోయింది. కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు.