Vijay Devarakonda: అయ్యో మొన్న నిశ్చితార్థం.. ఈరోజు యాక్సిడెంట్.. నేను సేఫ్ అటున్న రౌడీ హీరో

శుభమాని మొన్నే నిశ్చితార్ధం చేసుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ కారు నిన్న రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు దెబ్బ తిన్నా విజయ్ సేఫ్ గా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

New Update
vijay devarakonda on Pahalgam attack

vijay devarakonda on Pahalgam attack

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కారు ప్రమాదానికి(Car Accident) గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి దగ్గరలో ఇది జరిగింది. ఈ యాక్సిడెంట్  నుంచి హీరో అయితే సురక్షితంగా తప్పించుకున్నారు. కానీ ఆయన కారు మాత్రం దెబ్బతింది. విజయ్ కారును ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదంజరిగింది. ఆ తరువాత అక్కడి నుంచి రౌడీ హీరో తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్ వచ్చేశారు. విజయ్‌ తన స్నేహితులతో కలసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విజయ్‌ కారు డ్రైవర్‌ అందె శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఉండవల్లి ఎస్.ఐ ఆర్.శేఖర్ తెలిపారు. 

పుట్టపర్తిలోనే చదువుకున్న విజయ్ దేవరకొండకు సత్యసాయి అంటే నమ్మకం ఎక్కువే ఉంది. దీంతో హీరో సత్యసాయి మహా సమాధిని దర్శించుకోడానికి వెళ్ళారు. ఆదివారం సమాధిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

Also Read :  పబ్లిక్ లో తమన్నా ఇలా చేసిందేంటి? ఫుల్ వైరలవుతున్న వీడియో!

నాకేం కాలేదు...సేఫ్ గానే ఉన్నాను..

మరోవైపు తనకు ఏమీ కాలేదని విజయ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అంతా బాగానే ఉంది..కారు మాత్రమే దెబ్బతింది..కానీ మేమంతా బాగానే ఉన్నాము. స్ట్రెంగ్త్ వర్కౌట్స్ కూడా చేసి ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను. మీ అందరికీ నా ప్రేమ, హగ్స్ అంటూ రాసుకొచ్చాడు హీరో. ఈ వార్త మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయనివ్వకండి…. అంటూ ఎక్స్ లో విజయ్ పోస్ట్ పెట్టాడు. కొన్ని రోజుల కిందట నటి రష్మిక మందన్నాతో రౌడీ హీరో నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వచ్చాయి. విజయ్ ఇంట్లోనే ఇద్దరి ఎంగేజ్ మెంట్ అయిందని చెప్పారు. ఫిబ్రవరిలో వీరిద్దరి పెళ్ళీ జరుగుతుందని తెలుస్తోంది. అయితే విజయ్ కానీ, రష్మికా కానీ దీనిపై ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. విజయ్ ప్రస్తుతం రాహుల్‌ సాంకృత్యాన్‌ తెరకెక్కించనున్న సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు.

Also Read :  టిక్ టాక్ దుర్గారావు కుటుంబంలో పెను విషాదం!

Advertisment
తాజా కథనాలు