/rtv/media/media_files/2025/09/21/road-accident-three-dead-two-seriously-injured-2025-09-21-07-14-40.jpg)
Road accident.. Three dead, two seriously injured
Big breaking : ఏపీ లోని బాపట్ల జిల్లా పర్చూరు సమీపంలోని మార్టూరు NH 16 రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుండి పిఠాపురానికి వెళ్తున్న కారు ఫెన్సింగ్ దిమ్మెను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతి వేగం.. కుక్క అడ్డురావడం కారణంగా తెలుస్తుంది. ఈ రోజు- తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ..విషయం తెలిసిన వెంటనే హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. AP 03BL 1116 హుండాయ్ గ్రాండ్ i 10 వాహనంలో మొత్తం 5 గురు వ్యక్తుల ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు మగవారు.. ఒక మహిళ ఉన్నారు. గాయపడిన ఇద్దరిని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్ (25)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తిరుపతి వైపు నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.