/rtv/media/media_files/2025/10/26/car-accident-on-jntu-bridge-in-hyderabad-2025-10-26-10-29-29.jpg)
Car accident on JNTU bridge in Hyderabad
Hyderabad News: హైదరాబాద్‌లోని జేఎన్టీయూ వంతెనపై కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం 8.00 గంటల సమయంలో రైతుబజార్ దాటి వంతెన ఎక్కిన కారు.. అతి వేగంతో తొలుత డివైడర్‌ను, ఆ తర్వాత ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగం ప్రమాదకరం అని పోలీసులు పదే పదే చెబుతున్నా జనం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి చాలామంది మత్యువాత పడుతున్నారు. తాజాగా ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని జేఎన్టీయూ వంతెనపై ఓ కారు బీభత్సం చేసింది.
ఈ రోజు ఉదయం దాదాపు 8 గంటల సమయంలో రైతుబజార్ దాటిన తర్వాత వంతెన ఎక్కింది ఓ కారు. అతివేగంతో వస్తున్న కారు అదుపు తప్పించింది. దీంతో తొలుత డివైడర్‌ను ఢీ కొట్టారు. బ్యాలెన్స్ కాకపోవడంతో ఎదురుగా వస్తున్న టూ వీలర్‌ని ఢీ కొట్టింది. చివరకు ఆ కారు బోల్తా పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదం సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. వారంతా సూడాన్‌కి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వారంతా కారు దిగిపోయారు. అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని మెల్లగా జారుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత యువతులు కారు దిగి మరో క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. యువకులు మాత్రం అక్కడే ఉన్నారు.
బీభత్సం సృష్టించిన కారును అద్దెకు తీసుకున్నారా? ఎవరైనా ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూడాన్‌కు చెందిన యువకులు నగరంలో చదువుకుంటూ శంషాబాద్‌లో నివాసముంటున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కారు బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం
మరో ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మానోపాడుమండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై సాల్ట్ హోటల్ సమీపంలో కారు బోల్తా పడింది. కర్నూలు జిల్లా లక్ష్మీపురం నుంచి హైదరాబాద్ కి వెళ్తుండగా.. మార్గ మధ్యలో జాతీయ రహదారి పక్కన ఉన్న డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు 108 సిబ్బంది తెలిపారు. కారులో ఐదు మంది ఉన్నట్లు గుర్తించారు. మేరీ, కళావతి( 60) పరిస్థితి విషమంగా ఉందని, సులోమన్ (63), మనోజకుమార్ (37), శెట్టి (35), ఫియాపాప (3) గాయాలు అయినట్లు 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. రహదారి పక్కన ఉన్న డివైడర్ కు తగులుకుంటూ రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొని ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని హైవే సిబ్బంది తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : దీపావళి వేళ నల్గొండలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే..?
Follow Us