/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t081151018-2025-11-04-08-12-52.jpg)
Another fatal road accident.. Six people died on the spot
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని బారాబంకి జిల్లాలో సోమవారం సాయంత్రం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదం(Car Accident) లో ఆరుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దేవా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్లుపూర్ గ్రామ సమీపంలోని కల్యాణి నదిపై ఉన్న వంతెనపై వాహనాలు వెళుతుండగా రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. వీరంతా ఫతేపూర్ పట్టణ నివాసితులుగా తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం కారణంగా కారు రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో క్రేన్ సహయంతో కారును రోడ్డు పై నుంచి తొలగించారు.
Also Read : సీరియల్ నటికి వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..
Another Fatal Road Accident
సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, ఆపై జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా నలుగురు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ అర్పిత్ విజయవర్గియాతో సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ శశాంక్ త్రిపాఠి మాట్లాడుతూ, "ప్రమాదంలో ఆరుగురు మరణించారు. తీవ్ర గాయాలైన ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చారు" అని అన్నారు. ప్రాథమిక దర్యాప్తులో కారు ట్రక్కు లేన్‌లోకి ప్రవేశించిందని, అందుకే ప్రమాదం జరిగిందని త్రిపాఠి తెలిపారు.
Also Read : ఖమ్మంలో దారుణం.. బిడ్డకు విడాకులిచ్చాడని అల్లుడిపై హత్యాయత్నం.. అడ్డువచ్చిన అల్లుడి తల్లిపై....
Follow Us