ORR : ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన కారు

రంగారెడ్డి జిల్లా లోని నార్సింగి పోలీసుస్టేష‌న్ ప‌రిధిలో ఘోరం జ‌రిగింది. ఔట‌ర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారులో మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్రమ‌త్తమైన డ్రైవ‌ర్ కారును ఆపేశాడు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు బ‌య‌ట‌కు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

New Update
Car Fire Near ORR

Car Fire Near ORR

ORR : రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని నార్సింగి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఘోరం జ‌రిగింది. ఔట‌ర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న కారులో మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్రమ‌త్తమైన డ్రైవ‌ర్ కారును ఆక‌స్మాత్తుగా ఆపేశాడు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు బ‌య‌ట‌కు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రింగ్‌ రోడ్డుపై వెళుతున్న కారులో అనుకోకుడా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన కారు డ్రైవర్‌ అందులో ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేసిన రోడ్డు మీదే కారు ఆపేశాడు. దీంతో అందరూ కారు దిగేశారు. వారు దిగగానే ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు కాలిపోయింది.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. అయితే అప్పటికే కారు పూర్తిగా ద‌గ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదాన్ని గుర్తించి దిగిపోవడంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో ప్రాణనష్టం వాటిల్లేదని పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో  పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద ఘ‌ట‌న‌తో ఔట‌ర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు. అనంతరం కారు శిథిలాలను తొలగించారు.

రెండు రోజుల క్రితం క‌ర్నూల్ జిల్లాలో వీ కావేరి ట్రావెల్స్ బ‌స్సులో మంట‌లు చెల‌రేగి 19 మంది స‌జీవ‌ద‌హ‌న‌మైన సంగ‌తి తెలిసిందే. నిన్న పెద్ద అంబ‌ర్‌పేట్ వ‌ద్ద ఔట‌ర్ రింగ్ రోడ్డుపై న్యూ గో అనే ఎల‌క్ట్రిక్ బ‌స్సు బోల్తా ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాల‌య్యాయి.

Advertisment
తాజా కథనాలు