BIG BREAKING: మరో ప్రమాదం.. తాండురు వైపు వస్తున్న బస్సును ఢీకొన్న లారీ
చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరువకముందే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది.
చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరువకముందే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది.
చేవెళ్ల బస్సు ప్రమాదంలో తన భర్త దస్తగిరి బాబా చనిపోవడంతో.. గుండెలవిసేలా విలపించింది అతని భార్య. మనస్పర్థల కారణంగా.. కొంతకాలం నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారని వెల్లడించింది.
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొన్నేళ్లలో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగినా రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
చేవెళ్ల రోడ్డు ప్రమాదం మరవక ముందే మంగళవారం తెల్లవారుజామున వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నల్గొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సుట్రాక్టర్ ను ఢీ కొంది.. కరీంనగర్ లో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను, సత్యసాయిజిల్లాలో ట్రావెల్స్ బస్సు ఐషర్ ను ఢీ కొన్నాయి.
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొని 19 మంది మృతి చెందారు. బస్సు తాండూరు నుంచి బయల్దేరిన గంటన్నరలోనే ప్రమాదం జరిగింది.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు.
ఈ ప్రమాదంలో ఓ తల్లి మరణించగా, తండ్రికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారంతా క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు వారిని బస్సులో నుంచి బయటకు తీశారు.
చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరన్ని దారుణాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 25 మంది చనిపోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గురైన టిప్పర్ లారీ, బస్సుపై చలాన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మృత్యువాత పడిన వారి కుటుంబాలకు, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు