/rtv/media/media_files/2025/11/03/bus-accident-childrens-2025-11-03-13-39-46.jpg)
రంగారెడ్డి జిల్లాలో పెను విషాదం సంభవించింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో అతివేగంగా వస్తున్న టిప్పర్ లారీ, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 24 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు వస్తుండగా, అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కంకర లోడ్ మొత్తం బస్సుపైకి దూసుకెళ్లడంతో, ప్రయాణికులు కంకర కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
తండ్రికి తీవ్రంగా గాయాలు
ఈ ప్రమాదంలో ఓ తల్లి మరణించగా, తండ్రికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారంతా క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు వారిని బస్సులో నుంచి బయటకు తీశారు. తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ ప్రమాద స్థలిలో కూర్చుండిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చేవెళ్ల బస్సు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తనూషా, సాయి ప్రియా, నందిని స్పాట్ లో మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముగ్గురు బిడ్డల మరణంతో ఆ తల్లి గుండెపగిలేలా రోధిస్తుంది. బిడ్డల మరణ వార్త తెలియగానే తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి.
 Follow Us