/rtv/media/media_files/2025/11/03/challans-2025-11-03-11-58-26.jpg)
చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరన్ని దారుణాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 25 మంది చనిపోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గురైన టిప్పర్ లారీ, బస్సుపై చలాన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సుపై 3 సిగ్నల్ జంప్, లారీపై 2 నో ఎంట్రీ చలాన్లు ఉన్నట్లు ఫొటోలు రిలీజ్ చేశారు. లారీపై 3270 ఫైన్, బస్సుపై 2305 చలాన్లు ఉన్నాయి. మరోవైపు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పలువురు ప్రయాణికులు చెబుతుంటే.. మరికొందరు లారీ డ్రైవర్ కారణమని అంటున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకరలారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 మందికి పైగా ప్రయాణికులు స్పాట్ లో మృతి చెందారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 11 మంది మహిళలు, 10 మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లళ్లు ఒకేసారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన తనూషా, సాయి ప్రియా, నందిని మృతి చెందారు. ఎన్నో ఆశలతో మొదలైన వీరి ప్రయాణం అర్థంతరంగా ముగిసింది. ఘటన స్థలంలో ప్రయాణికుల ఆర్థనాదాలు మనసుల్ని పిండేస్తున్నాయి. గత నెల 17న జరిగిన ఓ పెళ్లివేడుకలో సందడిగా గడిపిన అక్కాచెల్లెళ్లు ముగ్గురూ ఇవాళ విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులు ముగ్గురూ హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో చదువుతున్నారు.
మరోవైపు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన అఖిలరెడ్డి అనే యువతి కూడా ఇదే ప్రమాదంలో చనిపోయారు. ఎంబీఏ చదువుతున్న కుమార్తె మృతితో అఖిల తల్లి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనాస్థలానికి వచ్చి బోరున విలపించారు.
రంగారెడ్డి బస్సు ప్రమాదంపై హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్లు: 9912919545, 9440854433. ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు వీటి ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. చేవెళ్ల ప్రభుత్వఆసుపత్రిలో క్షతగాత్రులకు మంత్రి పొన్నం పరామర్శించారు.
 Follow Us