/rtv/media/media_files/2025/11/04/tandoor-2025-11-04-07-25-46.jpg)
రంగారెడ్డి(ranga-reddy) జిల్లా మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు(Bus Accident), టిప్పర్ ఢీకొని 19 మంది మృతి చెందారు. బస్సు తాండూరు నుంచి బయల్దేరిన గంటన్నరలోనే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎక్కువగా మహిళలే చనిపోయారు. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్‌లో నివాసముంటున్న గుర్రాల శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె అఖిలారెడ్డి కూడా తుదిశ్వాస విడిచింది. అఖిలారెడ్డి గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతుంది.
అయితే కొత్త ఫోన్ కొన్నామని వచ్చి తీసుకెళ్లమంటూ అఖిల తల్లి అలివేలు మంగ కూతురికి ఫోన్ చేయడంతో అఖిలారెడ్డి హైదరాబాద్ నుంచి శనివారం ఇంటికి వెళ్లింది. దీంతో కొత్త ఫోన్ తీసుకుని తల్లిదండ్రులు, సోదరుడితో ఆదివారం సంతోషంగా గడిపిన అఖిల.. సోమవారం కాలేజీకి వెళ్లేందుకు ఉదయాన్నే హైదరాబాద్ కు పయణం అయింది. కొత్త ఫోన్ మురిపెం తీరకుండానే మార్గంమధ్యలోనే ఆమె చనిపోయింది. కూతురి మరణ వార్త విని అఖిలారెడ్డి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read : NH 163 రోడ్డు కాదు..రక్తచరిత్ర.. 720 ప్రమాదాలు, 211 మంది మృతి!
సొంతింటికి వచ్చి
ఇక తాండూరు పట్టణం వాల్మీకినగర్‌కు చెందిన కిష్టాపురం వెంకటమ్మ(21), ప్రసాద్ దంపతులు. హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో భర్త జాబ్ చేస్తుండగా, భార్య సూపర్‌మార్కెట్‌లో పని చేస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి శనివారం వారిద్దరూ తాండూరులోని తమ సొంతింటికి వచ్చారు. ఇక సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు రైలులో హైదరాబాద్ కు వెళ్లాలని అనుకున్నారు. చివరకు ప్రసాద్ ఒక్కడే రైలెక్కి ఎక్కగా.. వెంకటమ్మ మాత్రం పొద్దున తాండూరులో ఆర్టీసీ బస్సు ఎక్కి మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయింది. భర్తతోపాటు రైల్లోనే వెళ్లి ఉంటే ప్రాణాలు నిలిచేవని కుటుంబ సభ్యులు రోదించారు.
Also Read : కలవరపెట్టిన బస్సు ప్రమాదాలు..తెల్లవారుజామునే...
Follow Us