Bus Accidents: కలవరపెట్టిన బస్సు ప్రమాదాలు.. తెల్లవారుజామునే...

చేవెళ్ల రోడ్డు ప్రమాదం మరవక ముందే మంగళవారం తెల్లవారుజామున వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నల్గొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సుట్రాక్టర్ ను ఢీ కొంది.. కరీంనగర్ లో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను, సత్యసాయిజిల్లాలో ట్రావెల్స్ బస్సు ఐషర్ ను ఢీ కొన్నాయి.

New Update
FotoJet - 2025-11-04T073324.163

A series of bus accidents in the early hours of the morning

నల్గొండ జిల్లాలో  రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కట్‌ పల్లిహైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు(Bus Accident) ఒకటి  ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. కాగా గాయపడిన క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ఏపీలోని కావలి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే బస్సులో ఉన్న ప్రయాణీకులకు తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది.

Also Read :  మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్!

సత్యసాయిజిల్లాలో  ట్రావెల్స్ బస్సు..

ఏపీలోని సత్యసాయి జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి హైవేపై జబ్బర్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు ఐషర్ వాహనాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని చెన్నై కొత్తపల్లి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో హైదరాబాద్ కు వెళుతున్న వినీత్, సురక్ష కుటుంబం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో వినీత్ భార్య సురక్ష (32) మృతి చెందగా వినీత్ , కూతురు నిధి(3) గాయలయ్యాయి.చెన్నై కొత్తపల్లి మండలం దామాజిపల్లి  జాతీయ రహదారి44 పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన చెన్నై కొత్తపల్లి పోలీసులు.

Also Read :  చేవెళ్ల బస్సు ప్రమాదం.. అనాథలైపోయిన ఇద్దరు చిన్నారులు

కరీంనగర్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సు..

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున మరో రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రేణికుంట శివారులో  ధాన్యం లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు బస్ లో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయలయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డు పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కాగా ధాన్యం లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను బస్సు ఢీ కొనడం తో ట్రాక్టర్ లో ఉన్న ధాన్యం బస్తాలు రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

Advertisment
తాజా కథనాలు