/rtv/media/media_files/2025/09/22/pm-modi-2025-09-22-20-30-49.jpg)
PM Modi
చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మృత్యువాత పడిన వారి కుటుంబాలకు, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
The loss of lives due to a mishap in the Rangareddy district of Telangana is deeply saddening. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.
— PMO India (@PMOIndia) November 3, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be…
ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు పరిహారం
రంగారెడ్డి ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 పరిహారం ప్రకటించారు మోదీ. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని తాను ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. చేవెళ్ల RTC బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా అందిచనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాల పై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో…
— Ponnam Prabhakar (@Ponnam_INC) November 3, 2025
తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైనందున, మృతుల్లో ఎక్కువమంది తాండూరు ప్రాంతానికి చెందినవారు కావడంతో, ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
  
 Follow Us