/rtv/media/media_files/2025/11/04/driver-1-2025-11-04-12-47-02.jpg)
రంగారెడ్డి(ranga-reddy) జిల్లా, చేవెళ్ల మండలం, మీర్జాగూడ వద్ద ఘోర బస్సు ప్రమాదం(Bus Accident) జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కొండగట్టు బస్సు ప్రమాద ఘటన తరువాత ఇదే అత్యంత విషాదకరమైన సంఘటన. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొనడం వల్ల జరిగింది. ప్రమాదం ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కాకుండా, టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్‌లో అతివేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా 19 మందికి పైగా దుర్మరణం చెందారు.
ప్రమాదానికి గురైన ఆర్టీసీ అద్దె బస్సు (TG34 TA 6354) తాండూరు నుంచి బయల్దేరింది. బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన దస్తగిరి బాబా(45) దీనికి డ్రైవర్. 20 ఏళ్ల కింద పాత తాండూరుకు వలస వచ్చిన ఈయనకు ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో టిప్పర్, లారీ డ్రైవర్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. పదేళ్లుగా ఆర్టీసీ ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే సోమవారం నడిపిన బస్సుకు పది రోజుల క్రితమే డ్రైవర్‌గా చేరాడు. ప్రతి రోజూ ఇదే బస్సు హైదరాబాద్‌కు మొదటి సర్వీసుగా వెళ్తోంది.
రెండేండ్ల క్రితం తాండూరు నుంచి వికారాబాద్​వెళ్లే బస్సులో కూడా దస్తగిరి బాబా డ్రైవర్‌గా పని చేశాడు. ఆ సమయంలో దస్తగిరి వెళ్తున్న బస్సు....వికారాబాద్ అనంతగిరి సమీపంలో బ్రేకులు ఫెయిల్​అయింది. దస్తగిరి అప్పుడు చాకచక్యంగా వ్యవహరించి ఎత్తు వైపు తీసుకువెళ్లి ఓ చెట్టును స్వల్పంగా ఢీకొట్టి బస్సును ఆపాడు. దీంతో ఆబస్సులోని దాదాపు 40 మంది ప్రాణాలు కాపాడాడు. కానీ సోమవారం జరిగిన ప్రమాదంలో అతనితో పాటుగా మరో 19 మంది ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
Also Read : కూతురు లవ్ మ్యారేజ్...యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన తండ్రీకొడుకులు..
బస్సు కండక్టర్ రాధ ఎమోషనల్
అయితే బస్సు ప్రమాద దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన బస్సు కండక్టర్(bus-conductor) రాధ ఎమోషనల్ అయ్యారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదమంంతా తమ కళ్లముందే జరిగిపోయిందన్నారు. టిప్పర్ చాలా వేగంగా వస్తున్నట్లుగా తాను, మా డ్రైవర్ దస్తగిరి గుర్తించామన్నారు. వెంటనే డ్రైవర్ దస్తగిరి బస్సును కిందకు తిప్పే ప్రయత్నం చేశాడని.. . అలా చేయకపోయింటే ఇంకా చాలమంది ప్రాణాలు కోల్పోయేవారని వెల్లడించింది. డ్రైవర్ వెనుక సీట్లో కూర్చొన్నవారిపై చాలా కంకర రాళ్లు పడ్డాయని... ఓ వ్యక్తి తనను కాపాడాడని రాధ వెల్లడించింది. తల నుంచి రక్తం కారుతున్న క్రమంలో తాను చున్నీతో కట్టుకున్నానని ఆమె వివరించింది. ఈ విషాదకరమైన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించింది.
మరోవైపు చేవెళ్ల బస్సు ప్రమాదంలో తన భర్త దస్తగిరి బాబా చనిపోవడంతో.. గుండెలవిసేలా విలపించింది అతని భార్య. మనస్పర్థల కారణంగా.. కొంతకాలం నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారని వెల్లడించింది. అంతా సర్దుకుంటుందని అనుకుంటున్న తరుణంలో.. ఇలా జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
Pulse News Exclusive
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 3, 2025
చేవెళ్ల బస్సు ప్రమాదంలో తన భర్త దస్తగిరి బాబా (డ్రైవర్) చనిపోవడంతో.. గుండెలవిసేలా విలపించిన భార్య
మనస్పర్థల కారణంగా.. కొంతకాలం నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారని వెల్లడించిన మహిళ సోదరి
అంతా సర్దుకుంటుందని అనుకుంటున్న తరుణంలో.. ఇలా జరిగిపోయిందని ఆవేదన… pic.twitter.com/kFaXvdXY8h
Also Read : రెయిన్ అలెర్ట్.. మరికొద్ది గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం
Follow Us