Haryana Municipal elections: హర్యానాలో వికసించిన కమలం.. 9 కార్పొరేషన్లు కైవసం!
హర్యానాలోని 10 మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలు వెలువడ్డాయి. 9 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవకపోగా మనేసర్లో స్వతంత్ర మహిళా అభ్యర్థి విజయం సాధించారు. అభివృద్ధి పనుల వల్లే ప్రజలు తమకు ఓటు వేశారని సీఎం నాయబ్ సింగ్ సైనీ అన్నారు.