Crime News: BJP నేత దారుణ హత్య.. చేతులను తాడుతో కట్టి, ఉరేసి..!

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో దారుణ హత్య జరిగింది. BJP కార్యకర్త, గోఘాట్ మైనారిటీ ఫ్రంట్ మండల అధ్యక్షుడు షేక్ బాకిబుల్లా మృతదేహం అనుమానాస్పదంగా కనిపించింది. ఆయన ఇంటి బాల్కనిలో రెండు చేతులు కట్టేసి, ఉరేసి వేలాడుతూ కనిపించడంతో అంతా షాక్‌కు గురయ్యారు.

New Update
west bengal bjp leader dead body found his house

west bengal bjp leader dead body found his house

Crime News: పశ్చిమ బెంగాల్‌లో దారుణ హత్య జరిగింది. బీజేపీ నేత అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. హుగ్లీ జిల్లా అరంబాగ్‌లోని గోఘాట్‌లో ఉన్న ఇంటి బాల్కనీలో బిజెపి మైనారిటీ సెల్ అధ్యక్షుడి మృతదేహం కనిపించడంతో అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!

దారుణ హత్య

అతడి పేరు షేక్ బాకిబుల్లా. అతడు ఒక బిజెపి కార్యకర్త. అలాగే గోఘాట్ మైనారిటీ ఫ్రంట్ మండల అధ్యక్షుడు కూడా. హుగ్లీ జిల్లా గోఘాట్‌లోని సంబంది ప్రాంతంలో నివాసముంటున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు అతడి మృతదేహం ఇంటి బాల్కనీలో కనిపించింది. రెండు చేతులు కట్టి వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.  

 Also Read :  ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

షేక్ బాకిబుల్లా హత్యకు గురయ్యారని.. ఇది రాజకీయ హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసులో సరైన దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులతో పాటు బిజెపి నాయకత్వం డిమాండ్ చేసింది. 

Also Read: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్‌లు.. ఏవి మంచివి?

Advertisment
Advertisment
తాజా కథనాలు