/rtv/media/media_files/2025/05/31/ZlT64nChIxVN1ocEyilz.jpg)
Bandi Sanjay
బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే సొంత కార్యకర్తలే తమను బట్టలు ఊడదీసి కొడతారని కేంద్రం మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పార్టీ అయిన బీజేపీ.. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోదని అన్నారు. బీజేపీ పెద్ద పార్టీ, చిన్న పార్టీ అయిన బీఆర్ఎస్‌తో పొత్తు ఎలా పెట్టుకుంటుందని విమర్శించారు.
BRS తో పొత్తు అంటే మా కార్యకర్తలే మమ్మల్ని బట్టలూడదీసి కొడుతరు.
— 🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩(Modi Ji Ka Parivar) (@PSR4Bharat) June 23, 2025
- @bandisanjay_bjppic.twitter.com/vVTdOmPU9N
లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ సమయంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించిందని ఆయన చెప్పుకొచ్చారు. దానికి బీజేపీ ఒప్పుకోలేదని మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే బీజేపీ కార్యకర్తలే తమను బట్టలూడతీసి కొడతారని అన్నారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.