Bihar Elections : ప్రశాంతంగా బిహార్ మొదటి దశ పోలింగ్..ఓటేసిన నితీష్
బిహార్ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ 3.75 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45 వేలకుపైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది.
బిహార్ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ 3.75 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45 వేలకుపైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ నేడు జరుగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. మహాగఠ్బంధన్ కూటమి అధికారంలోకి వస్తే 'మైబహిన్ మాన్ యోజన' పథకాన్ని ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. జనవరి 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ రూ.30 వేలు కానుకగా అందిస్తామని పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు రవి కిషన్ శుక్లాకు ఫోన్ ద్వారా మరణ బెదిరింపులు వచ్చాయి. ఇటీవల బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలకు సంబంధించి, గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఉమ్మడి మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది. ఈ మ్యానిఫెస్టోను కూటమిలోని అన్ని సీనియర్ నాయకుల సమక్షంలో విడుదల చేశారు.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలోనే విపక్ష కూటమి మహాఘఠ్బంధన్ మంగళవారం తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.
ప్రశాంత్ కిషోర్ 2 రాష్ట్రాల ఓటరు జాబితాల్లో తన పేరు నమోదు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్తో పాటు తన సొంత రాష్ట్రం బీహార్లోని ఓటరు జాబితాలో కూడా ప్రశాంత్ కిషోర్ పేరు ఉంది. ఈ అంశం బీహార్ ఎన్నికల వేళ వివాదాన్ని రేకెత్తిస్తోంది.
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ను ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎన్నికల ఇన్ ఛార్జ్ అశోక్ గెహ్లాట్ మీడియా సమావేశంలో ప్రకటించారు