/rtv/media/media_files/2025/11/14/bihar-1-2025-11-14-06-49-24.jpg)
1951 తర్వాత బీహార్ చరిత్రలోనే మొదటిసారి అత్యధికంగా పోలింగ్ నమోదైంది. 67.13 శాతం పోలింగ్ తో బీహారీలు రికార్డ్ సృష్టించారు. ఇక్కడ ఎన్నికలు మొదట నుంచి అందరి దృష్టీ ఆకర్షిస్తున్నాయి. అభివృద్ధి కావాలా? ఆటవిక పాలనా? అంటూ ఎన్డీయే ప్రచారం చేసింది. ఉపాధి, ఓట్ల చోరీ ప్రధాన అంశాలుగా విపక్ష మహాగఠ్‌బంధన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీయే కూటమి వైపే మొగ్గు చూపించాయి.
రెండు దశల్లో పోలింగ్..
బీహార్ లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో రెండు ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. ఇక్కడ ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే 122 సీట్లు రావాల్సిందే. బీహార్ లో మొత్తం 7.45 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3.92, స్త్రీలు 3.50 కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ రెండు విడతల్లో ఎన్నికలు సాగాయి. రెండు దశల్లోనూ రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదైంది. పురుషుల్లో 62.98 శాతం, మహిళల్లో 71.78 శాతం మంది ఓటేశారు. మొదటి దశ పోలింగ్ నవంబరు 6న.. 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. 1314 మంది అభ్యర్ఘథులు బరిలో నిలుచున్నారు. మొదటి దశలో 65 కన్నా ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఇక రెండో దశ నవంబర్11న 112 సీట్లకు పోలింగ్ జరిగింది. మొత్తం 3. 70 కోట్ల మంది ఓటర్లు ఓటు వేశారు. 1302 మంది అభ్యర్థులు పోటీ చేయగా..69 కన్నా ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది.
పార్టీలు, అభ్యర్థులు..
ఎన్డీయే కూటమిలో జేడీయూ 101, బీజేపీ 101, లోక్ జన్‌శక్తి (రాంవిలాస్) 28, హిందుస్థానీఅవామ్ మోర్చా 06, రాష్ట్రీయ లోక్‌మోర్చా ఆర్‌ఎల్‌ఎం 06 స్థానాల్లో పోటీ చేశాయి. మఢౌరాలోలోక్‌జన్‌శక్తి (రాంవిలాస్) అభ్యర్థి సీమా సింగ్ నామినేషన్ తిరస్కరించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్‌కు ఎన్డీయే మద్దతు ప్రకటించింది. ఇక మహాగఠ్‌బంధన్ కు సంబంధించి ఆర్జేడీ 143, కాంగ్రెస్ 61, సీపీఐ(ఎంఎల్)ఎల్ 20, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ 12, సీపీఐ 09, సీపీఎం 04, ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ 03, జనశక్తి జనతాదళ్ 01, స్వతంత్రులు 02 పోటీ చేశారు. ఇతరుల్లో జన్ సురాజ్ పార్టీ 238, బీఎస్పీ 130, ఆప్ 121, ఏఐఎంఐఎం 25, రాష్ట్రీయ లోక్జనశక్తి 25, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) 25 తదితర పార్టీలు బరిలో ఉన్నాయి. వీటల్లో తేజస్వీ యాదవ్- ఆర్జేడీ (రాఘోపుర్); సామ్రాట్ చౌదరీ- భాజపా (తారాపుర్); విజయ్ కుమార్ సిన్హా- భాజపా (లఖిసరాయ్); మైథిలీ ఠాకుర్- భాజపా (అలీనగర్); ప్రేమ్ కుమార్ - భాజపా (గయా టౌన్); తేజ్‌ప్రతాప్ యాదవ్- జేజేడీ (మహువా); బిజేంద్ర ప్రసాద్ యాదవ్- జేడీయూ (సుపౌల్); తార్‌కిశోర్ ప్రసాద్- భాజపా (కఠిహార్); రాజేశ్ కుమార్ - కాంగ్రెస్ (కుటుంబ) కీలక స్థానాలుగా ఉన్నాయి.
Follow Us