Bihar Elections: ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపించే 50% ఫార్ములా.. అదేంటో తెలుసా?

ప్రతీ ఎన్నికల్లో గెలుస్తూ దూసుకుపోతోంది బీజేపీ. మిత్రపక్షాలతో కలిసి ప్రధాని మోదీ నేతృత్వంలో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని నిరూపించుకుంది.

New Update
PM Modi

PM Modi

ప్రతీ ఎన్నికల్లో గెలుస్తూ దూసుకుపోతోంది బీజేపీ. మిత్రపక్షాలతో కలిసి ప్రధాని మోదీ నేతృత్వంలో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని నిరూపించుకుంది. తాజాగా బీహార్‌ ఎన్నికల్లో కూడా విజయభేరీ మోగించింది. అయితే 2023 జులై 18న ప్రధాని మోదీ ఎన్డీయే కూటమి పార్టీల సమావేశంలో ఓ కీలక ప్రకటన చేశారు. 

Also Read: ఎన్డీయేకు రవీంద్ర జడేజాగా నిరుపించుకున్న చిరాగ్‌ పాస్వాన్

''ఎన్నికల్లో మనం 50 శాతం ఓట్‌ షేరింగ్ సాధించాలని'' పిలుపునిచ్చారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్ ఎన్నికల్లో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ఇదే ఫార్ములాను ప్రతి ఎన్నికల్లో అనుసరిస్తూ గెలుస్తున్నారు. ఈసారి బీహార్‌ ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీకి 21 శాతం, జేడీయూకి 19, ఎల్జేపీకి 5, ఇతర మిత్రపక్షాలకు 7 శాతం ఓట్లు వస్తున్నట్లు కనిపిస్తోంది. వీటన్నింటినీ కలిపితే ఎన్డీయే వాటా 50 శాతం వాటా దాటింది. 

Also Read: కౌంటింగ్‌కు ముందు గుండెపోటుతో అభ్యర్థి మృతి.. ఈయనకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 49.75 ఓట్ల శాతం సాధించింది. ఢిల్లీలో 47.15, మధ్యప్రదేశ్‌ 48.62, ఛత్తీస్‌గఢ్‌ 46.27 , రాజస్థాన్ 41.70 శాతం ఓట్ల షేరింగ్ సాధించింది. తాజాగా బీహార్‌ ఎన్నికల్లో 50 శాతం దాటింది. దాదాపు 50 శాతం ఓట్ల వాటా ద్వారా మూడింట రెండొంతుల సీట్లు సాధించగలమనేదే బీజేపీ వ్యూహం.  

Advertisment
తాజా కథనాలు