Rama NIShad : నితీష్ పూల దండ వేసిన అభ్యర్థికి మంత్రి పదవి.. ఎవరీ రమా నిషాద్?

2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ముజఫర్‌పూర్‌లోని ఔరై అసెంబ్లీ స్థానం నుంచి ఏకంగా 57,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి ఈమె రికార్డు సృష్టించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, మంత్రి పదవి ఛాన్సును దక్కించుకున్నారు.

New Update
nitish nishad rama

బీహార్‌లో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి కొలువుదీరింది. పాట్నాలోని గాంధీ మైదానంలో నితీష్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటు బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. మొత్తం 26 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, వీరిలో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. వారిలో ఒకరైన రమా నిషాద్ ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. 

57,000 ఓట్ల భారీ మెజారిటీతో

2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ముజఫర్‌పూర్‌లోని ఔరై అసెంబ్లీ స్థానం నుంచి ఏకంగా 57,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి ఈమె రికార్డు సృష్టించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, మంత్రి పదవి ఛాన్సును దక్కించుకున్నారు. ఆమెకు టికెట్ దక్కడం కూడా ఒక సంచలనమే. 2020 ఎన్నికల్లో గ్రాండ్ అలయన్స్ అభ్యర్థిపై 48,000 ఓట్ల తేడాతో విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్‌సురత్ రాయ్‌ను బీజేపీ పక్కన పెట్టి, రమా నిషాద్‌కు టికెట్ కేటాయించింది. అయితే ఎన్నికల ర్యాలీలో రమా నిషాద్ మెడలో సీఎం నితీశ్ కుమార్ పూలమాల వేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ సీఎం ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేశారు.

రమా నిషాద్ కుటుంబ నేపథ్యం బీహార్ రాజకీయాల్లో సుస్థిరమైనది. రమా నిషాద్ భర్త మాజీ ఎంపీ దినేష్ నిషాద్. ఈయకు గతేడాది బీజేపీ లోక్‌సభ టికెట్ నిరాకరించబడడంతో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి బీజేపీలో చేరి తన భార్యకు టికెట్ ఇప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించారు ఆమె మామ కెప్టెన్ జై నారాయణ్ ప్రసాద్ నిషాద్ బీహార్ రాజకీయాల్లో ప్రముఖులు. ఆయన నాలుగుసార్లు పార్లమెంటుకు ఎన్నికై కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ముగ్గురు మహిళా మంత్రులలో ఒకరైన రమా నిషాద్‌తో పాటు, మాజీ ఎమ్మెల్యే అయిన లేషి సింగ్ , క్రీడాకారిణి అయిన శ్రేయసి సింగ్‌కు కూడా కేబినెట్‌లో చోటు దక్కింది.

Advertisment
తాజా కథనాలు