Bihar Elections: హత్య కేసులో జైలుకెళ్లి ఎన్నికల్లో గెలిచిన JDU నేత

బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే విజయభేరీ మోగించింది. ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చి జేడీయూ నుంచి బరిలోకి దిగిన అనంత్‌ సింగ్‌ కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందారు.

New Update
Jailed JD(U) leader Anant Singh wins by over 28,000 votes

Jailed JD(U) leader Anant Singh wins by over 28,000 votes

బీహార్‌ ఎన్నిక(Bihar elections)ల్లో ఎన్డీయే విజయభేరీ మోగించింది. ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చి జేడీయూ(jdu) నుంచి బరిలోకి దిగిన అనంత్‌ సింగ్‌ కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందారు. మొకామా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవిపై 28 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అనంత్ సింగ్ ఇప్పటివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2005 లో జేడీయూ నుంచి పోటీ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, ఆ తర్వాత 2010లో కూడా గెలుపొందారు. 2015లో స్వంతత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక 2020 ఎన్నికలకు ముందు ఆర్జేడీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. 

Also Read: బీహార్‌లో ఎన్డీయేను గెలిపించిన మహిళా ఓటర్లు

Jailed JD(U) Leader Anant Singh Wins

అయితే 2022లో ఆయుధాల సరఫరాకు సంబంధించి ఓ కేసులో అనంత్‌ సింగ్‌ దోషిగా తేలారు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవి పోయింది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య నీలందేవి పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో జేడీయూ నుంచి బరిలోకి దిగిన అనంత్‌ సింగ్ మరోసారి విజయం సాధించారు. ఆయనపై ఇప్పటిదాకా 28 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఇటీవల జన్‌సురాజ్‌ పార్టీ కార్యకర్త దులార్‌ చంద్‌పై హత్య కేసులో అనంత్‌ సింగ్‌ జైలుకెళ్లి బయటికొచ్చారు. తాజాగా ఎన్నికల ఫలితాల్లో ఆయన గెలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: 114 ఏళ్ల ‘వృక్షమాత’ సాలుమరద తిమ్మక్క మృతి.. పవన్ ఎమోషనల్

Advertisment
తాజా కథనాలు