Tejaswi Yadav: తేజస్వీ యాదవ్‌కు చెమటలు పట్టించిన సతీశ్‌ కుమార్ ఎవరు ?

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌ కూటమి ఘోర పరాజయం పొందింది. అయితే రాఘోపూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గెలుపొందారు.

New Update
Tejashwi Yadav Wins Raghopur After Nailbiter In RJD's Safest Seat

Tejashwi Yadav Wins Raghopur After Nailbiter In RJD's Safest Seat

బీహార్‌ అసెంబ్లీ ఎన్నిక(Bihar elections)ల్లో మహాగఠ్‌బంధన్‌ కూటమి ఘోర పరాజయం పొందింది. అయితే రాఘోపూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(tejaswi-yadav) గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి సతీశ్‌ కుమార్‌పై ఆయన 14500 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో తేజస్వీ యాదవ్‌ ఓ రౌండ్‌లో 5 వేల ఓట్ల తేడాతో వెనకంజలో కూడా పడ్డారు. దీంతో రాఘోపూర్‌ స్థానంలో ఆయన గెలుస్తారా ? లేదా ? అనేది ఉత్కంఠగా మారింది. చివరికి తేజస్వీ యాదవే అక్కడ విజయం సాధించారు.  

Also Read: జంగిల్‌రాజాకు ఎంట్రీ లేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Tejashwi Yadav Wins Raghopur

ఓట్ల లెక్కింపులో ఉదయం 11.30 గంటలకు సతీశ్‌ కుమార్‌.. తేజస్వీపై 3 వేల ఓట్ల తేడాతో ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మెల్లగా తేజస్వీ పుంజుకున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు 129 ఓట్ల తేడాతో ఆయన ఆధిక్యంలోకి వచ్చారు. మళ్లీ కాసేపటికే సతీశ్‌.. 343 ఓట్ల మెజార్టీతో దూసుకుపోయారు. అలా వీళ్లిద్దరూ ఒకటి, రెండో స్థానాల్లో తారుమారు అవుతూ వచ్చారు. మొత్తం 32 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగింది. చివరి రౌండ్‌ పూర్తయ్యేసరికి తేజస్వీ యాదవ్‌ 14,532 ఓట్ల తేడాతో గెలిచారు. 

Also Read: ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపించే 50% ఫార్ములా.. అదేంటో తెలుసా?

ఓట్ల లెక్కింపులో తేజస్వీకి చెమటలు పట్టించిన సతీశ్‌ యాదవ్‌ 15 ఏళ్ల క్రితం అదే నియోజకవర్గంలో తేజస్వీ తల్లి, మాజీ సీఎం రబ్రీదేవిని కూడా ఓడించారు. అంతేకాదు ఆయన గతంలో ఆర్డేడీ పార్టీలోనే ఉండేవారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిపోయారు. 2010 ఎన్నికల్లో లాలూ సతీమణి రబ్రీ దేవిపై 13 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు. 

Advertisment
తాజా కథనాలు