/rtv/media/media_files/2025/11/16/pk-2025-11-16-14-34-25.jpg)
Rs 14,000 crore World Bank funds used in Bihar poll: Prashant Kishor's party's big claim
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌సూరజ్ పార్టీకి ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమిపై సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించిన రూ.14 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను ఎన్డీయే ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ మహిళల ఖాతాల్లో రూ.10 వేలు వేసి నిధులు మళ్లించారని పేర్కొన్నారు.
Also Read: ఢిల్లీ పేలుళ్లకు 18 గంటల ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడ ఉన్నాడంటే?
అంతేకాదు ఈ ఏడాది జూన్ నుంచి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా నితీశ్ కుమార్ సర్కార్ ఓట్లు కొనేందుకు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఆరోపించారు. దీనిబట్టి చూస్తే ఎన్డీయే ప్రభుత్వం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసినట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ (EC) సమగ్ర దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి ఎన్డీయే కూటమి.. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పేరుతో 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 వేలు నగదు జమచేసింది.
Also Read: బూతులు తిట్టారు, చెప్పుతో కొట్టబోయారు.. లాలూ కూతురు సంచలన ఆరోపణలు!
స్వయం ఉపాధి, మహిళా సాధికారత కోసం ఈ డబ్బును తమ ప్రభుత్వం అందించిందని ప్రధాని మోదీ అన్నారు. అలాగే వివిధ దశల్లో కూడా ఈ ఆర్థిక సాయం రూ.2 లక్షల అందిస్తామని అక్కడి ప్రభుత్వం చెప్పింది. పశుపోషణ, వ్యవసాయం, టైలరింగ్ వంటి రంగాల్లో ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది.
Follow Us