/rtv/media/media_files/2025/11/14/bihar-2025-11-14-12-03-19.jpg)
తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాతే ముఖానికి ఉన్న మాస్క్‌ను తొలగిస్తానని ది ప్లూరల్స్ పార్టీ అధినేత్రి పుష్పం ప్రియ చౌదరి చేసిన ప్రతిజ్ఞ నెరవేరేలా కనిపించడం లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఆమె దర్భంగా అసెంబ్లీ స్థానంలో భారీ తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి సంజయ్ సరావగి 11,592 ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు. ఈయన ఇక్కడి నుంచి 2020లో కూడా గెలిచారు. ప్లూరల్స్ పార్టీ చీఫ్ పుష్పం ప్రియ, బీజేపీ అభ్యర్థి సంజయ్ సరావగి కంటే ఏకంగా 26,000 ఓట్లకు పైగా తేడాతో వెనుకబడి ఉన్నారు.
Bihar Election Results 2025: Pushpam Priya Choudhary का बिगड़ गया खेल, कौन निकला आगे?#Bihar#BiharElection2025#BiharElections#pushpampriyachoudharypic.twitter.com/VuKrmu7WOh
— Bihar Tak (@BiharTakChannel) November 14, 2025
విజిల్ గుర్తుపై పోటీ
2020లో ది ప్లూరల్స్ పార్టీని స్థాపించారు పుష్పం ప్రియ చౌదరి. కులం, మతం ఆధారిత రాజకీయాలకు అతీతంగా బీహార్‌కు కొత్త తరహా రాజకీయాలను పరిచయం చేయడమే తన లక్ష్యమని ఆమె ప్రకటించారు. ఆమె పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాల్లో విజిల్ గుర్తుపై పోటీ చేసింది. అయితే ఒక్కచోట కూడా ఆమె అభ్యర్ధులు లీడ్ లో లేరు.
ఇక పుష్పం ప్రియ చౌదరి ఎప్పుడూ నలుపు రంగు దుస్తులు, మాస్కు ధరించే కనిపిస్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే మాస్క్ తీస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈమె మాజీ జేడీయూ ఎమ్మెల్యే వినోద్ కుమార్ చౌదరి కుమార్తె. ఆమె తాత, ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితులు.. సమతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.ఆమె మామ, వినయ్ కుమార్ చౌదరి, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బేణిపూర్ స్థానం నుంచి జేడీయూ అభ్యర్థిగా గెలిచారు.
ఇక పుష్పం ప్రియ చౌదరి వియూనివర్శిటీ ఆఫ్ సస్సెక్స్ (University of Sussex), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (London School of Economics) నుండి మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు బీహార్ ప్రభుత్వ పర్యాటక, ఆరోగ్య విభాగాలలో కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఆమె పార్టీ 2020 ఎన్నికల్లో 148 స్థానాల్లో పోటీ చేసి, అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది.
Follow Us