Bihar Elections: బిహార్ రిజల్ట్స్.. 2 లక్షల గులాబ్‌జామున్లు.. 500 కిలోల లడ్డులతో రెడీ అవుతున్న అద్భుతమైన విందు

బిహార్ ఎన్నికల ఫలితాల్లో మొకామా నియోజకవర్గంలో అనంత్ సింగ్ విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అతను విందు కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబ్ జామున్లు 2 లక్షల వరకు తయారు చేయిస్తున్నారు.

New Update
bihar elections

bihar elections

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు రానున్నాయి. కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందనే ఉత్కంఠతో అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. తమ పార్టీ గెలవబోతుందని ముందుగానే పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు గెలుపొందిన తర్వాత అద్భుతమైన విందుకు రెడీ చేస్తున్నారు. బిహార్ ఎన్నికల ఫలితాల్లో మొకామా నియోజకవర్గంలో బలమైన పోటీ నెలకొంది. ఇక్కడ జేడీయూ నుంచి అనంత్ సింగ్, ఆర్‌జేడీ నుంచి వీణా సింగ్ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. అయితే అనంత్ సింగ్ విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అతని ఇంట్లో విందు కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అనంత్ సింగ్ ఏకంగా 10,000 లీటర్ల సుధా పాలు తెప్పించారు. 48 మంది మిఠాయి తయారీదారులు వివిధ రకాల స్వీట్లు తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. ఒక్క గులాబ్ జామున్లు 2 లక్షల వరకు తయారు చేయిస్తున్నారు. గెలిచిన తర్వాత దాదాపుగా 50,000 మందికి భారీ విందు ఏర్పాటు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: జూబ్లీహిల్స్ లో హైటెన్షన్.. సునీత ధర్నా.. పోలీసుల లాఠీ ఛార్జ్!

ఇది కూడా చూడండి: Bihar Elections 2025: సర్వే సంస్థలని 2సార్లు బురిడీ కొట్టించిన బిహారీలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు.. మరీ ఈసారి!?

బీజేపీ పార్టీ భారీగా మానేర్ లడ్డూలు..

ఇక బీజేపీ కార్యకర్తలు కూడా తమ గెలుపుపై గట్టి నమ్మకంతో ఉన్నారు. బీజేపీ శిబిరంలో కూడా స్వీట్లు పంపిణీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విజయాన్ని జరుపుకోవడానికి, కార్యకర్తలకు పంచడానికి 500 కిలోల మానేర్ లడ్డూలకు ఆర్డర్ ఇచ్చారు. బీహార్‌లో ఈ మానేర్ లడ్డూలు చాలా ప్రసిద్ధి చెందాయి. జీడిపప్పు, ఎండుద్రాక్ష, పుచ్చకాయ గింజలు, శనగపిండితో తయారుచేసిన బూందీని చక్కెర పాకంలో అద్ది ఈ నోరూరించే లడ్డూలను తయారు చేస్తారు. ఈ లడ్డూల చరిత్ర 350 సంవత్సరాల నాటిది అని చెబుతారు. మొఘల్ చక్రవర్తి ఆలం మనేర్ షరీఫ్‌ను సందర్శించినప్పుడు వీటిని ఆయన వంటవారు తయారు చేశారట. ఈ లడ్డూలను మట్టి కుండలలో భద్రపరిచి, సుదూర ప్రాంతాలకు కూడా పంపుతారు. అయితే ఈ బిహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ లేదా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎవరు రాజకీయాల్లో రాణిస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తేజస్వి యాదవ్ తన హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారా లేదా అనేది కూడా ఆసక్తిగా మారింది. మరి కొన్ని గంటల్లో ఈ ఫలితాలు తెలనున్నాయి.

Advertisment
తాజా కథనాలు