ఓవైసీకి దిమ్మతిరిగే షాక్... MIM పార్టీకి బిహారీలు బిగ్ ట్విస్ట్!

2020 ఎన్నికల్లో సంచలనం సృష్టించి ఏకంగా ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న AIMIM, ప్రస్తుత లెక్కింపు ట్రెండ్‌ల ప్రకారం రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

New Update
AIMIM Chief Asaduddin Owaisi

AIMIM Chief Asaduddin Owaisi

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంటుంది. 174 స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు కొనసాగుతోన్నారు. 66 స్థానాల్లో మహాగఠ్‌బంధన్‌ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ ఫలితాల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు ప్రశాంత్ కిశోర్‌ జన్‌సురాజ్‌ పార్టీ. దీంతో భారీ మెజార్టీతో  ఎన్డీయే కూటమి మరోసారి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ఈ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. 

ఏకంగా ఐదు అసెంబ్లీ స్థానాలు

2020 ఎన్నికల్లో సంచలనం సృష్టించి ఏకంగా ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న AIMIM, ప్రస్తుత లెక్కింపు ట్రెండ్‌ల ప్రకారం రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బలరాంపూర్, బైసి స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక్కడ ఆస్తికరమైన విషయం ఏంటంటే.. బలరాంపూర్ స్థానంలో AIMIM గత ఎన్నికల్లో గెలవలేదు. AIMIM 2020లో గెలిచిన ఐదు స్థానాల్లో బైసి ఒక్కటి మినహా మిగిలిన నాలుగు స్థానాలు అమూర్, బహదూర్‌గంజ్, జోకిహాట్, కోచాధామన్ లో ప్రస్తుతం వెనుకబడి ఉంది. 

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గతంలో అమూర్ స్థానం నుండి గెలిచిన అక్తరుల్ ఇమాన్ కూడా ఇప్పుడు ఆ స్థానంలో వెనుకబడి ఉన్నారు. గత ఎన్నికల తర్వాత AIMIMకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరిపోగా, ఇమాన్ ఒక్కరే పార్టీలో ఉన్నారు.AIMIM పార్టీ బీహార్‌లో తన బలాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధానంగా సీమాంచల్ ప్రాంతంపైనే ఆశలు పెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఆ పార్టీకి పట్టు లభించకపోవడం పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. అర్రియా, కటిహార్, కిషన్‌గంజ్, పూర్ణియా జిల్లాల్లో  ముస్లిం జనాభా శాతం ఎక్కువగా ఉంటుంది. సీమాంచల్‌లో కూడా 18 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ఈ ట్రెండ్‌లు సీమాంచల్‌లో కూడా బీహార్‌లోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఎన్డీఏ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టం చేస్తున్నాయి.