Suresh Raina : సురేష్ రైనాకు బిగ్ షాక్.. ఈడీ సమన్లు!
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి రేపు విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది.
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి రేపు విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తాను కేవలం గేమింగ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానని, అది బెట్టింగ్ ప్లాట్ ఫామ్ కాదంటూ విచారణ అనంతరం విజయ్ చేసిన కామెంట్స్ పై పాల్ ఫైరయ్యారు.
హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో భాగంగా నేడు ఈడీ విచారణకు హజరయ్యారు. తన పేరు బెట్టింగ్ కేసులో రాయడం వల్ల హాజరు అయినట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఉన్నాయని తాను A23 అనే యాప్ గేమింగ్ యాప్‌ను ప్రమోషన్ చేసినట్లు తెలిపారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణ ముగిసింది. 2025 జులై 30వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో గల ఈడీ కార్యాలయానికి ప్రకాష్ రాజ్ చేరుకున్నారు. దాదాపుగా 5 గంటల పాటు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, రానాలకు ఈడీ బిగ్ షాకిచ్చింది. వీరిపై ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది.
హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ సీఐడీ విచారించనుంది. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వైసీపీ నేత యడ్ల తాతాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్, వైజాగ్‌లను కేంద్రంగా చేసుకుని ఆన్లైన్ బెట్టింగ్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాతాజీతో పాటు నాగేశ్వరరావు, వెంకటరావు, మురళీపై కేసు నమోదు చేశారు.
బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ యాప్స్‌లో రూ. లక్ష పోగొట్టుకున్న హైదరాబాద్ యువకుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అత్తాపూర్‌లో చోటుచేసుకుంది. ఐఫోన్, బుల్లెట్ బైక్ అమ్మి మరీ బెట్టింగ్‌కు పాల్పడ్డాడు