Hyderabad Metro: వివాదంలో  హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం

హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

New Update
Hyderabad metro

Hyderabad metro

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్..  వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ మెట్లో రై ళ్లలో యథేచ్ఛగా జరుగుతున్న బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌ ఎన్వీఎస్ రెడ్డికి  నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ను తక్షణమే దాఖలు చేయాలని ఆదేశించింది. 

Also Read: Air india:పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్‌ ఇండియా!

మెట్రో రైళ్లలో చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ.. హైకోర్టులో అడ్వకేట్ నాగూర్ బాబు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలులో నిబంధనలను ఖతారు చేయకుండా అధికారులు ఎలా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు అనుమతులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది యువతను తప్పుదారిలోకి మళ్లించే ప్రమాదం ఉందని అన్నారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

మరోవైపు.. తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017 స్పష్టంగా అమల్లో ఉన్నప్పటికీ, HMRL తో పాటు దాని  అనుబంధ సంస్థలు కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడానికి భారీగా ముడుపులు అందుకున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ అక్రమ లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ కుంభకోణంలో ఎంత మంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు లాభం పొందారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

వెలుగులోకి సంచలన విషయాలు

ఈ పిటిషన్‌పై గురువారం  తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కీలక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న అనంతరం, ప్రతివాదులైన HMRL ఎండీకి నోటీసులు జారీ చేశారు. పూర్తి ఆధారాలు, వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. దీంతో ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు న్యాయ నిపుణులు అంటున్నారు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఒకవేళ ఇది HMRL నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

Also Read:RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే

Also Read: All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటన

hyderabad | metro | Betting Apps | court | notice | latest-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు