Prakash Raj : ఇక నుంచి బెట్టింగ్ ప్రచారం చేయను : ప్రకాష్ రాజ్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణ ముగిసింది. 2025 జులై 30వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో గల ఈడీ కార్యాలయానికి  ప్రకాష్ రాజ్ చేరుకున్నారు.  దాదాపుగా 5 గంటల పాటు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు.

New Update
prakash-raj

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణ ముగిసింది. 2025 జులై 30వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో గల ఈడీ కార్యాలయానికి  ప్రకాష్ రాజ్ చేరుకున్నారు.  దాదాపుగా 5 గంటల పాటు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఈడీ అధికారులు తన అకౌంట్స్ మొత్తం చూశారన్నారు.  అంతేకాకుండా స్టేట్ మెంట్ కూడా రికార్డు చేశారని, తనని మళ్లీ విచారణకు రమ్మని పిలువలేద్దన్నారు.  2016లో తాను ఓ యాప్ కు మాత్రమే ప్రమోట్ చేశానని,  అందుకు తాను డబ్బులు కూడా తీసుకోలేదని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఇక నుంచి అలాంటి యాప్ లను తాను ప్రమోట్ చేయనని తెలిపారు ప్రకాష్ రాజ్. 

Also Read :  మళ్ళీ మాయ చేయబోతున్న విజయ్ - రష్మిక! కొత్త మూవీ అప్డేట్ అదిరింది

కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపడుతోంది. ప్రకాష్ రాజ్ జంగ్లీ రమ్మీ వంటి బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి.  ఈ కేసులో ప్రకాష్ రాజ్‌తో పాటుగా సినీ సెలబ్రేటీలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వంటి పలువురు సినీ ప్రముఖులకు కూడా ఈడీ నోటీసులు పంపించింది. విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దుబాయ్ నుండి ఆపరేట్ అవుతున్న బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్‌లోనే పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ విచారణ ఇంకా కొనసాగుతుంది, భవిష్యత్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

Also Read :  హిట్ అండ్ రన్ కేసు.. నటి అరెస్ట్!

లక్షలు పొగొట్టుకుని, ప్రాణాలు తీసుకుని

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వలన చాలామంది యువకులు తమ ప్రాణాలను కోల్పోయారు. ముఖ్యంగా యూత్ ఈజీ మనీకి అలవాటు పడి లక్షలు పొగొట్టుకుని తమ ప్రాణాలు తీసుకున్నారు. డబ్బు పోగొట్టుకున్నవారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై డిప్రెషన్‌లోకి వెళ్లడం. ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిని సినీ సెలబ్రేటీలు ప్రమోట్ చేసి కోట్లు దండుకున్నారనే అరోపణలున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ సెలబ్రేటీలకు నోటీసులు పంపి విచారణ చేబడుతోంది. గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది, వారి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ యాప్‌ల ప్రకటనలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఈడీ  ప్రశ్నించనుంది. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషేధం.  ఈ రాష్ట్రాల్లో బెట్టింగ్‌లో పాల్గొన్నా లేదా నిర్వహించినా జరిమానాతో పాటు కఠినమైన శిక్షలు అమల్లో ఉంటాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొంటే ఏడాది జైలుశిక్షతో పాటుగా రూ. 5,000 జరిమానా, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తే 2 సంవత్సరాల జైలు, రూ.  10,000 జరిమానా విధించబడవచ్చు. ప్రభుత్వాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌లను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి. 

Betting Apps | hyderabad | Enforcement Directorate | prakash raj | latest-telugu-news | telugu-news | telugu-cinema-news | telugu-film-news | latest tollywood updates

Advertisment
తాజా కథనాలు