BIG BREAKING: అవును ప్రమోషన్ చేశాను తప్పేంటి.. బెట్టింగ్ యాప్స్‌పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో భాగంగా నేడు ఈడీ విచారణకు హజరయ్యారు. తన పేరు బెట్టింగ్ కేసులో రాయడం వల్ల హాజరు అయినట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఉన్నాయని తాను A23 అనే యాప్ గేమింగ్ యాప్‌ను ప్రమోషన్ చేసినట్లు తెలిపారు.

New Update

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్‌లకు ప్రమోట్ చేశాడని తనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో విజయ్ దేవరకొండ నేడు ఈడీ విచారణకు హాజరు అయ్యారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్ కేసులో తన పేరు రావడం వల్ల విచారణకు పిలిచినట్లు విజయ్ తెలిపారు. దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అని రెండు రకాలు ఉన్నాయన్నారు. నేను A23 అనే యాప్ గేమింగ్ యాప్‌ను ప్రమోషన్ చేశానని క్లారిటీ ఇచ్చినట్లు తెలిపారు. అసలు బెట్టింగ్ యాప్స్‌కు, గేమింగ్ యాప్స్‌కు సంబంధం లేదని తెలిపినట్లు వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Coolie Latest Update: 'బాషా'ని మించేలా 'కూలీ' ఇంటర్వెల్.. గూస్‌బంప్స్ పక్కా!

గేమింగ్ యాప్స్ లీగల్ అని..

గేమింగ్ యాప్స్ అనేది దేశంలోని చాలా రాష్ట్రాల్లో లీగల్ అని, దీనికి జీఎస్టీ, టాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్ అన్ని ఉంటాయని తెలిపారు. దేశంలో గేమింగ్ యాప్స్ ఐపీఎల్, కబాడీ, వాలీ బాల్‌కి స్పాన్సర్ కూడా చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే తన బ్యాంకు లావాదేవీలు అన్ని కూడా ఈడీకి సమర్పించినట్లు వెల్లడించారు. విజయ్ ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణాలో అసలు ఓపెన్ కాదని తెలిపారు. తాను కేవలం లీగల్‌గా ఉన్న గేమింగ్ యాప్స్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని విజయ్ దేవరకొండ వెల్లడించారు. అలాగే తాను చేసుకున్నా కాంట్రాక్ట్, లీగల్ తీసుకున్న అమౌంట్ వాటి వివరాలు అన్ని కూడా ఈడీకి సమర్పించినట్లు విజయ్ తెలిపారు.

విజయ్‌తో పాటు పలువురు..

ఈ బెట్టింగ్ యాప్ కేసులో విజయ్‌తో పాటు నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌‌‌‌రాజ్‌‌‌‌, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌‌‌‌రాజన్‌‌‌‌, శోభాశెట్టి, అమృత చౌదరి, నాయాని పావని, నేహ పఠాన్‌‌‌‌, పండు, పద్మావతి, ఇమ్రాన్‌‌‌‌ఖాన్‌‌‌‌, విష్ణుప్రియ, హర్షసాయి, టేస్టీ తేజ, రీతూచౌదరి, బండారు శేషయాని సుప్రీత, బయ్యా సన్నీ యాదవ్‌‌‌‌, శ్యామల, మేనేజ్‌‌‌‌మెంట్ ఆఫ్‌‌బెట్టింగ్‌ యాప్స్‌ కిరణ్‌‌‌‌గౌడ్‌‌‌‌, సోషల్‌‌‌‌ మీడియా ఇన్‌‌‌‌ఫ్లూయెన్సర్లు అజయ్‌‌, సన్నీ, సుధీర్‌‌‌‌, యూట్యూబర్‌‌‌‌ లోకల్‌‌‌ బాయ్‌‌‌‌ నాని ఉన్నారు. వీరిలో కొందరిని ఈడీ ఇప్పటికే పలు మార్లు విచారించింది. 

ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్‌ను సంపాదించుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రెండో పార్ట్ కూడా ఉంది. ఈ మొదటి పార్ట్‌లో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. అన్నాదమ్ముల ఎమోషన్‌తో వచ్చిన ఈ మూవీలో విజయ్‌క అన్నగా సత్యదేవ్ నటించాడు. సినిమా మొత్తం అన్నదమ్ముల చుట్టే తిరుగుతుంది. సినిమా స్టోరీ బాగానే ఉంది. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ కాస్త స్లోగా ఉందని టాక్ వినిపించింది.

ఇది కూడా చూడండి:Mass Jathara : రవితేజ మాస్ జాతర... నీ అమ్మని అక్కని.. బాబోయ్ ఇవేం లిరిక్స్ రా బాబు

Advertisment
తాజా కథనాలు