KA Paul : బుద్దుండాలి.. విజయ్ దేవరకొండపై కేఏ పాల్ ఫైర్!

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై  ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తాను కేవలం గేమింగ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానని, అది బెట్టింగ్ ప్లాట్ ఫామ్ కాదంటూ విచారణ అనంతరం విజయ్ చేసిన కామెంట్స్ పై పాల్ ఫైరయ్యారు.

New Update
vijay

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై  ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తాను కేవలం గేమింగ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానని, అది బెట్టింగ్ ప్లాట్ ఫామ్ కాదంటూ విచారణ అనంతరం విజయ్ చేసిన కామెంట్స్ పై పాల్ ఫైరయ్యారు. విజయ్ చెబుతున్న యాప్ లు  తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ అయ్యాయని అన్నారు. అయినప్పటికీ అవి లీగల్ అని ఎలా స్టేట్ మెంట్ ఇస్తున్నాడని మండిపడ్డారు.  "బుద్ధి ఉండాలి, నువ్వు చిన్న కుర్రోడివి మంచి కోసం పోరాడాలి, కానీ ఇలా ప్రజల ప్రాణాలు తీసే యాప్‌ల కోసం కాదు" అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.ఈ వ్యవహారంలో తక్షణమే క్షమాపణ చెప్పి, యాప్ ప్రచారం కోసం సంపాదించిన డబ్బులను బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నువ్వు చేసిన యాడ్స్ వల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. తక్షణమే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో క్షమాపణలు చెప్పి యాప్ ప్రచారం కోసం తీసుకున్న డబ్బులు మొత్తాన్ని బాధితులకు ఇవ్వాలని పాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.  

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో భాగంగా విజయ్ దేవరకొండ నిన్న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనతో పాటు ఇతర ప్రముఖులకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ, తాను ప్రచారం చేసింది చట్టబద్ధమైన 'గేమింగ్ యాప్' అని, ఇది బెట్టింగ్ యాప్ కాదని స్పష్టం చేశారు. గేమింగ్ యాప్స్ లీగల్ అని, వాటికి ప్రభుత్వం నుంచి లైసెన్సులు కూడా ఉంటాయని ఆయన వివరించారు. తాను ప్రచారం చేసిన A23 అనే యాప్ తెలంగాణలో కూడా అందుబాటులో లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన అన్ని వివరాలను, ముఖ్యంగా తన బ్యాంకు స్టేట్‌మెంట్‌లను సమర్పించానని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించాలని కోరుతూ కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత, ప్రజలు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ, వాటిని నిషేధించాలని కోరుతూ కేఏ పాల్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్న సినిమా నటులు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లలో పాల్గొంటున్నారని ఆరోపించారు. బెట్టింగ్ యాప్‌ల వల్ల వేలాది మంది యువకులు, ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని, తెలంగాణలోనే 1,000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని కేఏ పాల్ ఫిర్యాదులో వెల్లడించారు. 

Advertisment
తాజా కథనాలు