BIG BREAKING: గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
తూర్పు గోదావరిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద చోటుచేసుకుంది. పెళ్లి కోసమని వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు.
తూర్పు గోదావరిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద చోటుచేసుకుంది. పెళ్లి కోసమని వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు.
విజయనగరం ఉగ్రమూలాల కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ అనే వ్యక్తికి ఒక అజ్ఞాత వ్యక్తి ప్రోత్సాహం అందించాడని పోలీసులు గుర్తించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సిరాజ్ చేసిన వ్యాఖ్యలను ఆ వ్యక్తి మెచ్చుకున్నాడు.
అరేబియా సముద్రంలో అల్పపీడనం తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.
మాజీ మంత్రి కొడాలి నాని నేడో, రేపు అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. కేసు విచారణకు సహకరించకపోవడం, పారిపోతాడనే కారణాలతో ఇప్పటికే నానికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే కొడాలి నానిపై ఏపీలో పలు కేసులు ఉన్నాయి.
తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా అని పవన్ ప్రశ్నించారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. పోలీసులు వెంటనే అలర్ట్ అయి బాంబ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకుని రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి వద్ద రూ.25 వేలు అప్పు తీసుకున్న కుటుంబంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి ఆ బాలుడిని తమిళనాడులో రహస్యంగా పాతిపెట్టారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
తిరుమలలో ముగ్గురు పోలీసులు హల్ చల్ చేశారు. మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు రెండో ఘాట్‌రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు. కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గుర్తించారు.