Pastor Shalem Raju : బజారు మహిళలే మల్లెపూలు పెట్టుకుంటారు.. పాస్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు!-VIDEO

మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు చిలకలూరిపేట పాస్టర్ షాలెం రాజు. పల్నాడు జిల్లాలో జరిగిన ప్రార్థనా సభల్లో ఆయన మాట్లాడుతూ మల్లెపూలు కొనే మహిళలపై తప్పుడు ఆరోపణలు చేశారు.

New Update
mallepulu pastor

మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు చిలకలూరిపేట పాస్టర్ షాలెం రాజు. పల్నాడు జిల్లాలో జరిగిన ప్రార్థనా సభల్లో ఆయన మాట్లాడుతూ మల్లెపూలు కొనే మహిళలపై తప్పుడు ఆరోపణలు చేశారు.  ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చర్చిముందు మల్లెపూల దుకాణం

మల్లెపూలు అమ్మే ఓ వ్యాపారి చర్చిముందు దుకాణం పెట్టాడట. అయితే ఒక్కరు కూడా కొనరని లోపలికి వెళ్తూ పాస్టర్ అతనికి  చెప్పాడట. ఇంకోచోట పెట్టుకోమని సలహా కూడా ఇచ్చారట. ఎందుకు కొనరని వ్యాపారి తిరిగి ప్రశ్నిస్తే హేళనగా పాస్టర్ సమాధానం ఇచ్చారట.  జజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు.. వారు పరిశుద్ధ ఆత్మ సంబంధులంటూ షాలెం రాజు కామెంట్స్ చేశారు.  దీంతో ఆయన చేసిన  వ్యాఖ్యలపై హిందూ, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. షాలెం రాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు్న్నాయి. హైందవ ధర్మంపై దాడి జరుగుతోందంటూ ఆందోళన చేపడుతున్నాయి.  

క్రైస్తవుల మెప్పు పొందడం కోసం మల్లెపూల ముసుగులో హిందూ మహిళలపై కామెంట్స్ చేయడం ఏంటని మండిపడుతున్నాయి.  ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో సంతోషి సేవా పరిషత్, హైందవ సోదరీమణుల ఆధ్వర్యంలో షాలెం రాజుపై ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చిలకలూరిపేట చర్చ్ పాస్టర్ షాలెం రాజు మీద వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పాస్టర్ షాలెం రాజు అసలు పేరు బండారు వీరయ్య. వడ్డెర కులానికి చెందిన ఈయన పాస్టర్ కాకుముందు కూలీపనిచేసుకునేవాడని సమాచారం.   

Pastor Shalem Raju | Andhra Pradesh | chilakaluripet | hindu womens 

Advertisment
Advertisment
తాజా కథనాలు